హుస్నాబాద్ జనసేన నాయకులను బొమ్మ శ్రీరాం చక్రవర్తి మర్యాదపూర్వకంగా కలిసిన

తెలంగాణ, హుస్నాబాద్ నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ తగరపు శ్రీనివాస్ ని, జనసేన బలపరిచిన హుస్నాబాద్ బిజేపి ఎమ్మెల్యే అభ్యర్థి బొమ్మ శ్రీరాం చక్రవర్తి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా వారు పలు అంశాల మీద చర్చించి, గెలుపు దిశగా పని చేయాలని తీర్మానించారు. ఈ కార్యక్రమంలో మల్లెల సంతోష్, కొలుగూరి అనిల్, మోరె శ్రీకాంత్, నేవూరి పవన్, రెడ్డి గోపినాథ్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.