శ్యామల వ్యాఖ్యలను ఖండిస్తున్నా!

*హిందూపురం జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ ఆకుల ఉమేష్

హిందూపురం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణపై వైసీపీ అధికార ప్రతినిధి శ్యామల చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం అని హిందూపురం జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ ఆకుల ఉమేష్ తీవ్రంగా విమర్శించారు. అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్న హిందూపురానికి పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఇప్పటికే రూ.86 కోట్లు పంచాయతీరాజ్ నిధులు మంజూరు కాగా, వాటిలో 45 కోట్ల పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. అలాగే, పట్టణ అభివృద్ధికి రూ.92 కోట్లతో రోడ్లకు, రూ.136 కోట్లతో పైప్‌లైన్ పనులకు నిధులు మంజూరయ్యాయని వివరించారు. “ఈ అంత అభివృద్ధి కనిపించడం లేదంటే… శ్యామల గారికి దృష్టిలో సమస్య ఉండొచ్చు. నోరు ఉంది కదా అని నాయకులపై తక్కువ మాటలు మాట్లాడితే, ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. మీ స్థాయిని గుర్తించుకోండి. లేకుంటే ఈసారి వచ్చిన 11 సీట్లూ ఇక సాధ్యం కావు” అని ఆయన హెచ్చరించారు.

Share this content:

Post Comment