పవర్ స్టార్ అంటే ఇష్టం.. జివి ప్రకాష్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరుకు పరిచయమే అవసరం లేదు అలాగే ఆయనను ఇష్టపడని వారంటు ఉండరు. పవన్ కు కేవలం తెలుగు ఆడియెన్స్ మాత్రమే కాదు వేరే భాషల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. అంతే కాదు ఆడియెన్స్ కే కాదు సినీ సెలబ్రిటీస్ కు కూడా పవన్ కళ్యాణ్ అంటే ఇష్టం. లేటెస్ట్ గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమని అంటున్నాడు ఏ.ఆర్. రెహమాన్ మేనల్లుడు జివి ప్రకాష్.. మ్యూజిక్ డైరక్టర్ కం హీరో రెండిటిలో రాణిస్తున్న ప్రకాష్ ప్రస్తుతం సూర్య ఆకాశం నీ హద్దురా సినిమాకు మ్యూజిక్ అందించారు.

ఈ నేపధ్యంలో లేటెస్ట్ గా జివి ప్రకాష్ ఫ్యాన్స్ తో చేసిన చిట్ చాట్ లో పవర్ స్టార్ మీద తన ఇష్టాన్ని చెప్పారు. తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాన్ గారంటే ఇష్టం. ఆయన చరిష్మా తెలుసు. నేను ఒక్కసారి మాత్రమే ఆయన్ను కలిశాను. అది కూడా కరుణాకరణ్ సహాయంతో అతన్ని కలవడం జరిగింది. తను చేసిన ఉల్లసంగా ఉత్సాహంగా సినిమా పాటలు పవన్ సర్ విని బాగున్నాయని అన్నారని చెప్పాడు జివి ప్రకాష్. పవన్ గురించి మాట్లాడి పవర్ స్టార్ ఫ్యాన్స్ ను ఆనందంలో ముంచేశాడు జివి ప్రకాష్.

పవన్ గురించి కేవలం అతనే కాదు కోలీవుడ్ స్టార్స్ సైతం పాజిటివ్ గా మాట్లాడుతారు. సౌత్ లో క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్స్ లో పవన్ కళ్యాణ్ ఒకరు. టాలీవుడ్ లో కూడా యువ హీరో నితిన్, డైరక్టర్ హరీష్ శంకర్ వీరు ఓపెన్ గానే పవర్ స్టార్ అభిమానులం అంటూ కాలర్ ఎగురేసుకుని చెబుతారు. వీరు మాట్లాడుతున్నప్పుడు పవర్ స్టార్ ఫ్యాన్స్ హంగామా మరో రేంజ్ లో ఉంటుంది.