సదా నంద షేట్ తో ప్రచారంలో పాల్గొనడం నా అదృష్టం: కొట్టె మల్లికార్జున

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి తుది ప్రచార అంకం ముగిసింది. అన్ని రాజకీయ పార్టీలు హోరాహోరీగా ప్రచార కార్యక్రమాలను నిర్వహించాయి. ముఖ్యంగా బిజెపి జాతీయ అగ్ర నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రచార కార్యక్రమ బాధ్యతల్ని రాష్ట్ర బిజెపి నాయకులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, డాక్టర్ లక్ష్మణ్, పవన్ కళ్యాణ్, ఈటెల రాజేందర్ వంటి అగ్ర నాయకుల సూచనలతో మరియు సమన్వయంతో బిజెపి నాయకుల్లో, క్యాడర్ లో కొత్త జోష్ తీసుకొచ్చారు. బిజెపి నాయకులు కొట్టె మల్లికార్జున మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి సివిల్స్ ప్రిపరేషన్ విద్యార్థిగా, చదువుకున్న ఉన్నత విద్యావంతుడుగా, విద్యార్థి నాయకులుగా, బిజెపి యువ నాయకులుగా హైదరాబాద్ పరిధిలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో బిజెపి జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి శాఖా మంత్రి వర్యులు అమిత్ షా, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ముంబై ఎంపీ మనోజ్ కోటక్, గోవా బిజెపి అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు సదా నంద షేట్, మరియు డాక్టర్ లక్ష్మణ్ గారితో కలిసి ఖైరతాబాద్ చింతల రామచంద్రారెడ్డి, జూబ్లీ హిల్స్ దీపక్ రెడ్డి, కూకట్ పల్లి ప్రేమ్ కుమార్, శేరిలింగం పల్లి రవికుమార్ యాదవ్ గెలుపు కోసం ఇతర రాష్ట్ర నాయకులతో కలిసి పని చేయడం జరిగింది. అలాగే ఇతర బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థులు అంబర్ పేట, ముషీరాబాద్, సనత్ నగర్, సికింద్రాబాద్ నియోజక వర్గాల గెలుపు కోసం కృషి చేయడం ఆనందం గా ఉండడంతో పాటు, బిజెపి యువ నాయకులుగా గర్వపడుతున్నాను. ప్రతి ఒక్కరూ నవంబర్ 30న జరుగబోయే తెలంగాణ ఎన్నికల్లో బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపు కోసం మీ అమూల్య మైన ఓటు వేసి ప్రజా సంక్షేమం కోసం కృషి చేసే బిజెపి పార్టీను తెలంగాణలో అధికారంలోకి తీసుకురావాలని పేర్కొన్నారు.