అల్లూరి సీతారామరాజు కి నివాళులర్పించిన ఇచ్చాపురం జనసేన

ఇచ్చాపురం నియోజకవర్గంలో శనివారం ఇచ్చాపురం మండలం ఇన్నిసుపేట గ్రామంలో మన్నెం విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు కి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఇచ్చాపురం నియోజకవర్గ జనసేన సమన్వయకర్త దాసరి రాజు, జాయింట్ సెక్రటరీ తిప్పన దుర్యోధన రెడ్డి, దుంగ భాస్కరరావు నివాళులు అర్పిస్తూ అల్లూరి సీతారామరాజు ఒక మన్నెంలో జన్మించి అతిచిన్న వయస్సులోనే బ్రిటిష్ వారిని ఎదిరించిన విప్లవకారుడు. అతని చరిత్రను భారతదేశమే కాక ప్రపంచ దేశాలు ఆదర్శంగా తీసుకుంటున్న తరుణంలో భారతదేశ పౌరులు ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలని దాసరి రాజు కోరారు. ఈ కార్యక్రమంలో ఇచ్చాపురం నియోజకవర్గ నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.