ఆదర్శనీయుడు భగవాన్

*75 సార్లు రక్తదానం చేయడం అభినందనీయం
*నాయకర్, షరీఫ్, రామరాజు

రక్తదానం ప్రాణదానంతో సమానమని, 75 సార్లు రక్తదానం చేసిన భగవాన్ ఆదర్శనీయుడని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, ప్రభుత్వ సలహాదారు, శాసనమండలి మాజీ చైర్మన్ యం.ఏ షరీఫ్, తెలుగుదేశం పార్టీ నర్సాపురం నియోజకవర్గం ఇంచార్జి పొత్తూరి రామాంజనేయరాజులు అన్నారు. నర్సాపురం ఎమ్మెల్యే కార్యాలయంలో 75 సార్లు రక్తదానం చేసిన ఆదరణ ట్రస్ట్ చైర్మన్ బొడ్డు కృష్ణభగవాన్ కు శాలువ కప్పి పూలదండలతో నాయకర్, షరీఫ్, రామరాజు లు సత్కరించారు. ఆరోగ్యవంతులు ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేయవచ్చునని వారు అన్నారు. సమాజానికి భగవాన్ చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, అభిమానులు, ఆదరణ ట్రస్ట్ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment