రోడ్డు సమస్యపై ప్రశ్నిస్తే అనుచరులతో దాడి చేయిస్తాడా..

  • మదనపల్లె ఎమ్మెల్యే నవాబ్ బాషాపై ద్వజమెత్తిన జనసేన పార్టీ నాయకులు గంగారపు రామదాస్ చౌదరి

మదనపల్లె: ప్రశ్నించే వారిపై దాడులు చేయడం, సెల్ ఫోన్లు లాక్కోవడం, అవమానకరంగా మాట్లాడటం ఎమ్మెల్యే నవాబ్ బాషా కు నిత్యకృత్యంగా మారిందని జనసేన పార్టీ నాయకులు గంగారపు రామదాస్ చౌదరి విమర్శించారు. ‌శనివారం ఉమ్మడి చిత్తరూ జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, జిల్లా కార్యదర్శి సనాఉల్లా, రామసముధ్రం మండల అధ్యక్షుడు చంద్రశేఖర్ మదనపల్లె మండల అధ్యక్షుడు గ్రానైట్ బాబు, గౌతం వినోద్ జనసేన కార్యకర్తలు అందరూ కలిసి
రామసముద్రం మండలం కాపల్లె పంచాయితీ బాపనవారిపల్లి గ్రామస్థులతో సమావేశమైయ్యారు.‌ ఎమ్మెల్యే నవాజ్ బాషా అనుచరుల దాడిలో గాయపడిన వారిని పరామర్శించి దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా దాడికి దారి తీసిన పరిస్థితులపై గ్రామస్థులతో అరాతీశారు.‌ రోడ్డు సౌకర్యం కోసం ఇప్పటికే పలుమార్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగిందని గ్రామస్థులు వెల్లడించారు. ‌తామ గ్రామానికి రావాలని కోరిన సమయంలో పలువురు ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారని మహిళలకు కూడా గాయాలయ్యాయని వాపోయారు.‌ ఈ సందర్భంగా గంగారపు రామదాస్ చౌదరి మాట్లాడుతూ దశాబ్దాలుగా బాపనవారిపల్లి గ్రామస్తులు ఎదుర్కొంటున్న సమస్యను ఎమ్మెల్యే నవాజ్ బాషా దృష్టికి తీసుకుని వెళ్లాలని ప్రయత్నం చేసిన గ్రామస్థులపై ఎమ్మెల్యే అనుచరులు దాడి చేయడం దురదృష్టకరం అన్నారు.‌ ఎమ్మెల్యే నవాజ్ బాషా గతంలో కూడా ఇలాగే వ్యవహరించి దాడులు చేసిన సంఘటనలు వున్నాయన్నారు.‌ ఎమ్మెల్యే ఇచ్చిన హామి మేరకు నెల రోజులలో రోడ్డు సౌకర్యం పూర్తి చేయకపోతే తన సొంత నిధులతో తత్ఫలితంగా రోడ్డు ఏర్పాటు చేస్తామని హామి ఇచ్చారు. ‌