ప్రశ్నిస్తే రాత్రికి రాత్రే బోరు వేయిస్తారా..? శ్రీమతి కాంతిశ్రీ

  • మత్స్యకారుల గ్రామాలలో ఇంకా ఎన్నేళ్లు ఈ కష్టాలు?
  • ప్రజలను “ఓట్లు” వరకే వాడుకుంటారా?

శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, రణస్థలం మండలంలో ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి కాంతిశ్రీ మీడియాతో మాట్లాడుతూ.. కొవ్వాడ పంచాయతీ గ్రామస్తులు జనసైనికులు అందరూ కలిసికట్టుగా ఇంతకుముందు ఒక బోరు వేయించి గ్రామస్థుల దాహాన్ని తీర్చారు. అలాగే మా పంచాయతీకి మరలా జనసేన పార్టీ తరఫునుంచి మరో బోరు వేయించి మా మత్స్యకారుల దాహాన్ని తీర్చండి, మమ్మల్ని ఆదుకునే వారు ఎవరూ లేరు, మిగిలిన పార్టీ నాయకులు ఎలక్షన్ టైం లో ఓట్లు వేయించుకుంటున్నారు గాని మా గ్రామ అభివృద్ధిని చేయటం లేదు, మీరైనా మా పంచాయతీకి మరో మంచినీరు బోర్ వేయించి మా మత్స్యకారులను ఆదుకోండని నన్ను అడగటం జరిగింది. నేను రెండో మంచినీటి బోరును కూడా వేయించడానికి సిద్ధమయ్యాను. ముహూర్తం కూడా ఖరారు చేశాను. ఈ నెల 16వ తేదిన సాయంత్రం 4 గంటలకు ఆ స్థలాన్ని చూడటానికి మా పెద్ద కుమారుడు జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ వైస్ ప్రెసిడెంట్ “డాక్టర్ విశ్వక్ సేన్” గారిని పంపించడం జరిగింది. అయితే మా కొడుకు ఆ ప్రాంతంలో ఆ స్థలాన్ని పరిశీలించాడని తెలుసుకొని, జనసేన పార్టీ మరింత బలోపేతం అయిపోతుందని, వైసీపీ నాయకులు రాత్రికి, రాత్రే బోరు వేయించడం జరిగింది. ప్రశ్నిస్తే గాని, మేము ముందుకొస్తే గాని మీరు గ్రామ అభివృద్ధి చేయరా ఇంకా ఎన్నేళ్లు ఇలా? మీరు మా పై భయంతో బోరు వేయించారు కానీ, అక్కడ మంచి కార్యక్రమం కోసం మీరు వేయ్యలేదని కాంతిశ్రీ మీడియా ముందు దుయ్యబట్టారు.