ధర్మవరం జనసేనకి కేటాయిస్తే తప్పక విజయం సాధిస్తాం: చిలకం

ధర్మవరం, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన రెడ్డి తన స్వగృహంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. మీడియా ముఖంగా మాట్లాడుతూ ధర్మవరం సీటు జనసేన పార్టీకి కేటాయించాలని ఒకవేళ ధర్మవరంలో బిజెపి, టిడిపికి సీటు కేటాయిస్తే వర్గ విభేదాలతో గొడవలు చేసుకుంటారని దాన్ని వైసీపీ ఆసరాగా తీసుకొని గెలిచే అవకాశాలు ఉన్నాయని ఇటీవల చంద్రబాబు నాయుడు పెనుగొండకి వచ్చిన రోజు ధర్మవరంలో బిజెపి-టిడిపి వర్గాలు గొడవలు చేసుకుని ధర్మవరంలో వాహనాలు ధ్వంసం చేసుకుని రెండు వర్గాలు 307 కేసులు పెట్టుకున్నారని ధర్మవరం సీటు బిజెపికి లేదా టిడిపికి కేటాయిస్తే ఈ రెండు ఫ్యాక్షన్ వర్గాల మధ్య ధర్మవరం మరియు ఉమ్మడి అనంతపురం జిల్లా ఫ్యాక్షన్ తో నాశనం అవుతుందని అలగే ధర్మవరంలో అందరూ ఆహ్వానించే పార్టీ జనసేన పార్టీ అని ధర్మవరంలో 5 సంవత్సరాలు వైసీపీతో పోరాటం చేసిన పార్టీ కూడా జనసేన పార్టీనే అని వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని ధర్మవరంలో జనసేన పార్టీకే సీటు కేటాయించాలని జనసేన్ అధినేత పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, పురందేశ్వరిలను కోరుతున్నానని తెలియజేస్తూ సీటు ఇస్తే ధర్మవరంలో జనసేన పార్టీ తప్పక విజయం సాధిస్తుందని పేర్కొన్నారు.