తప్పుడు కథనాలు రాస్తే చూస్తూ ఊరుకోం

  • అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం

అనంతపురం: పత్రికా విలువలు పాటించకుండా జనసేన నాయకులు కొణిదెల నాగబాబు మాటలను వక్రీకరిస్తూ తప్పుడు కథనాలు రాస్తే చూస్తూ ఊరుకోం అని అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి పత్రికా ముఖంగా హెచ్చరించారు. సోమవారం విలేకరులతో మాట్లాడుతూ సాక్షి దినపత్రికలో.. టిడిపి నాయకులు మన కింద పని చేయాలి! జనసేన టిడిపి శ్రేణుల మధ్యన పొసగని పొత్తు!! పవన్ కళ్యాణ్, చిరంజీవి, బాలకృష్ణ అభిమానుల మధ్య సయోధ్య కుదరలేదు? మాకు సీఎం పదవి అవసరం లేదు? ఇలాంటి తప్పుడు రాతలు రాసి జనసేన టిడిపి శ్రేణులు మధ్యన అయోమయాన్ని సృష్టించి లబ్ధి పొందాలని చూస్తున్న వైసీపీ శ్రేణులకు ఇదే మా హెచ్చరిక. జనసేన టిడిపి పొత్తుని రెండు పార్టీల కార్యకర్తలు, అభిమానులు, నాయకులందరూ మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నారు. పవన్ కళ్యాణ్, చిరంజీవి మరియు బాలకృష్ణ అభిమానులు అందరం కలిసి కట్టుగా పనిచేసి వచ్చే ఎన్నికల్లో జనసేన-టిడిపి ప్రభుత్వాన్ని స్థాపించడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం. జనసేన, టిడిపి పొత్తుని ఓర్చుకోలేక అక్కస్సుతో వైసిపి వారు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. మీకు చాతనైతే మీరు అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు మీరు చేసిన అభివృద్ధి గురించి ప్రజలకు తెలియజేసి వచ్చే ఎన్నికల్లో గెలవండి? జనసేన-టిడిపి పొత్తు గురించి ఓర్చుకోలేక అక్కసు వెళ్లగక్కితే మీకు ఉపయోగం లేదని తెలుసుకోండి.