జగన్ కి బెయిల్ రద్దయితే చంచల్ గూడా దత్తపుత్రుడిగా వెళ్లిపోతారు: పంతం నానాజీ

జనసేన పార్టీ పీఏసీ సభ్యులు కాకినాడ రూరల్ నియోజకవర్గం ఇంచార్జ్, పంతం నానాజీ సోమవారం కాకినాడ గొడరిగుంట స్వగృహంలో మీడియా మిత్రులతో మాట్లాడుతూ.. ఇటీవల వైసీపీ కంపెనీ మంత్రులు పవన్ కళ్యాణ్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. మొన్న కొత్తగా క్యాబినెట్ లోకి వచ్చిన కాపు మంత్రులు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారు. రైతులను ఆదుకునేందుకు పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన కార్యక్రమానికి ప్రజాధారణ చూసి ఓర్వలేక పోతున్నారు. దత్తపుత్రుడు అని అంటున్నారు. మీ పార్టీ వైస్సార్ ముసుగు వేసుకున్న కాంగ్రెస్ పార్టీ అని ఎద్దేవా చేసారు. జనసేన పార్టీ కి అటువంటి అవసరం లేదు.. రాష్ట్రంలో ప్రత్యమ్నాయ పార్టీ ఇప్పుడు జనసేన పార్టీ ఒక్కటే. ఎంతో ప్రజాదరణ కలిగిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి పై విమర్శలు చేయడం వలనే గత మంత్రులను తీసేశారు. వారి పైన ఎంతో వ్యతిరేకత రావడంవల్ల ఇంటిలిజెన్స్ రిపోర్ట్ చూసుకుని ఆ మంత్రులను తప్పించారు.

జగన్ కి బెయిల్ రద్దయితే చంచల్ గూడ దత్తపుత్రుడిగా వెళ్లిపోతారు. ఇకనైనా మీకు ఇచ్చిన శాఖలపై దృష్టి పెడితే బాగుంటుంది. కొత్తగా మంత్రిపదవులు వచ్చాయి కదా వెంటనే పవన్ కల్యాణ్ గారి పై విమర్శలు చేస్తున్నారు.. సజ్జల స్క్రిప్ట్ మానేసి మీరు సొంతంగా మాట్లాడితే మంచిది. ప్రజలని కలవడానికి వెళ్తుంటే నడుం నెప్పులు వస్తున్నాయ్ దయచేసి కొత్తగా వచ్చిన మంత్రులైనా రోడ్లు వేయించండి, తిరుమల పవిత్రతను, టీటీడీని వైవీసుబ్బారెడ్డి అమ్మేయకుండా కాపాడండి, రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకువచ్చి యువతకి ఉద్యోగాలు కల్పించండి, పోలవరం ప్రాజెక్ట్ త్వరగా పూర్తి అయ్యేలా చేయండి, నిర్వాశితులుకు న్యాయం చేయండి.. ఇంకొక్కసారి పవన్ కళ్యాణ్ గారి పై అనవసరంగా విమర్శలు చేయడం మానుకోండి అని తెలిపారు.. ఈ కార్యక్రమం లో కరెడ్ల గోవింద్, రాష్ట్ర పార్టీసహాయ కార్యదర్శి తాటికాయల వీరబాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి శిరంగు శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి సోదే ముసలయ్య, నేమం గ్రామ అధ్యక్షులు దాసరి శివ తదితరులు పాల్గొన్నారు.