జగన్ వార్డ్ మెంబర్కి ఎక్కువ.. సర్పంచ్ కి తక్కువ – రాజా రెడ్డి
తిరుపతి, తన తండ్రి ముఖ్యమంత్రి పదవి చేపట్టాకే ప్రజాప్రతినిధిగా జగన్మోహన్ రెడ్డి ఎన్నికైయ్యారన్న వాస్తవాన్ని మరిచి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విమర్శించడం తగదని జనసేన తిరుపతి నగర అధ్యక్షులు రాజా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం నాడు రాజా రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రతిపక్ష హోదా కావాలని జగన్మోహన్ రెడ్డి పదే పదే అడుక్కోవడం ఆయన పదవీ కాంక్షకు నిదర్శనమన్నారు. తొలిసారి ఎమ్మెల్యే అయిన పవన్ కళ్యాణ్ నిబంధనలు గుర్తు చేస్తే పరదాల రెడ్డి ఫ్రస్టేషన్ లో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. పవన్ కళ్యాణ్ కార్పోరేటర్ కు ఎక్కువ ఎమ్మెల్యేకు తక్కువన్న జగన్మోహన్ రెడ్డి వార్డు మెంబర్ కు ఎక్కువ సర్పంచ్ కు తక్కువని ఆయన ఎద్దేవా చేశారు. చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకున్నట్లు వైఎస్సార్ పేరు చెప్పుకుని జగన్మోహన్ రెడ్డి ఎంపి, ఎమ్మెల్యే, సొంత పార్టీ ఏర్పాటు చేసుకోవడం నిజం కాదా అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ విలాసవంతమైన జీవితాన్ని వదిలి రాష్ట్ర ప్రజల కోసం పదేళ్ళు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని నిలిచిన నాయకుడని రాజారెడ్డి చెప్పుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డి పేరు చెబితే 11 సిబిఐ కేసులు, కోడికత్తి, గొడ్డలి పోటు గుర్తుకు వస్తాయన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి పని చేస్తున్న వ్యక్తి మా పవన్ కళ్యాణ్ అని, జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే గెలుస్తాడన్న గ్యారంటీ లేదన్న సందేహాన్ని వ్యక్తం చేశారు. ఇకనైనా జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ పై అవాకులు చెవాకులు పేలడం మానుకోకపోతే జనశ్రేణులు తగిన బుద్ధి చెప్తారని రాజా రెడ్డి హెచ్చరించారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు బాబ్జీ, కీర్తన, రాజేష్ ఆచారి, మునస్వామి, వెంకటేష్, రమేష్, పవన్, హేమంత్, జానకిరామి రెడ్డి, ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.
Share this content:
Post Comment