పవన్ కళ్యాణ్, చంద్రబాబు బేటి అయితే మీకెందుకు ఉలుకు?: గంగారపు రామదాస్ చౌదరి

మదనపల్లి, పవన్ కళ్యాణ్ అసలు సిసలైన వేటగాడు అని, వేట మొదలైతే అప్పుడు తెలుస్తుందని, పవన్ కళ్యాణ్, చంద్రబాబు బేటి వైసిపి నాయకులకు నిద్ర లేకుండా చేస్తోందని జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్‌ గంగారపు రామదాస్ చౌదరి ఎద్దేవా చేశారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఐటి విభాగ నాయకులు జగదీష్, జిల్లా కార్యదర్శి సనాఉల్లా, మదనపల్లె రూరల్ అధ్యక్షులు గ్రానైట్ బాబు, రెడ్డెమ్మ, శంకర, లక్ష్మీపతి, గజ్జల రెడ్డెప్ప, జనార్దన్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ‌ సందర్భంగా గంగారపు రామదాస్ చౌదరి మాట్లాడుతూ మదనపల్లె జిల్లా, రైల్వే లైన్ అటకెక్కించి మదనపల్లెకు తీరని అన్యాయం చేసిన ఎంపి మిధున్ రెడ్డి అన్నారు.