పవన్ కళ్యాణ్ జోలికి వస్తే వైసీపీ నాయకులకు పుట్టగతులు లేకుండా చేస్తాం.. గురుదత్

రాజానగరం నియోజకవర్గం: రాజానగరం మండలం, హెడ్ కోటర్ జనసేన పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు రాజానగరం పోలీస్ స్టేషన్లో అధికార వై.ఎస్.ఆర్.సీ.పీ నాయకులలు సోషల్ మీడియా వేదికగా జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ కుటుంబంపై చేసిన అనుచిత పోస్టులు & వ్యాఖ్యలపై రాజానగరం పోలీస్ స్టేషన్ లో శనివారం రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ &ఐక్యరాజ్య సమితి అవార్డు గ్రహీత మేడ గురుదత్ ప్రసాద్, శ్రీమతి జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంటా స్వరూప దేవి ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయమని స్టేషన్ ఇంచార్జ్ కు ఫైల్ సమర్పించారు. ఈ సందర్భంగా మేడ గురుదత్ మాట్లాడుతూ.. మా పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ వైఫల్యాల మీద సహేతుకమైన విమర్శలు చేసినప్పుడల్లా వాటికి సమాధానం చెప్పలేని వైసిపి నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై వ్యక్తిగత విమర్శలు చేయడం, వ్యక్తిత్వ హననం చేయడం పరిపాటి అయిపోయింది. తాజాగా మరోసారి శ్రీ పవన్ కళ్యాణ్ గారి కుటుంబంలోని స్త్రీలను టార్గెట్ చేసి దుర్భాషలు మాట్లాడడం జరుగుతోంది. ముఖ్యంగా శనివారం వర్రా రవీంద్రరెడ్డి అనబడే కుసంస్కారి సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టింగులు సభ్య సమాజం తలదించుకొనేలా ఉన్నాయి.. శాంతిభద్రతలు కాపాడవలసిన గురుతర బాధ్యతలో ఉన్న మీరు సదరు అసాంఘిక వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకొని మహిళల గౌరవాన్ని, ప్రజల హక్కులను కాపాడవలసిందిగా కోరుచూ.. కంప్లైంట్ ను పోలీస్ లకు అందించి రవీంద్రరెడ్డి మీద ఎఫ్.ఐ.ఆర్ వేయవలసిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ ప్రోగ్రామింగ్ కమిటీ సభ్యులు సోను (జమాల్), రాజానగరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు బత్తిన వెంకన్న దొర, కోరుకొండ మండల జనసేన పార్టీ అధ్యక్షులు మండపాక శ్రీను, సీతానగరం మండల జనసేన పార్టీ అధ్యక్షులు కారిచర్ల విజయ్ శంకర్, సూర్యారావుపేట జనసేన పార్టీ ఎంపీటీసీ డబ్బు (రమణ, రాజానగరం నియోజకవర్గం జనసేన పార్టీ ఐ.టీ -కో ఆర్డినేటర్ వెంటపాటి రామకృష్ణ, రాజానగరం మండలం జనసేన పార్టీ కో-కన్వీనర్ నగవరుపు భాను శంకర్, రాజానగరం నియోజకవర్గ జనసేన పార్టీ వీరమహిళలు కామిశెట్టి హిమ శ్రీ, కందికట్ల అరుణ, జనసేన పార్టీ వార్డ్ మెంబెర్ కాళ్ళ శేషు, రాజానగరం మండలం జనసేన పార్టీ యూత్ ప్రెసిడెంట్ పుత్సల సాయి, మన్య శ్రీను, మన్య నాగు, రాజానగరం మండలం యూత్ ఐకాన్ పల్లా హేమంత్ గారు, చదువు ముక్తేశ్వరరావు , తన్నీరు తాతాజీ, తోట శివ, గబ్బర్, చల్లా ప్రసాద్, వల్లేపల్లి రాజేష్, పెద్దకాపు తదితరులు పెద్దఎత్తున పాల్గొన్నారు.