పవర్ స్టార్ గొంతు సవరిస్తే..

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గొంతే గంభీరంగా ఉంటుంది. అలాంటి అక్రమాలపై ఆయన గొంతెత్తితే ఎలా ఉంటుందో ఏపీ రాజకీయాలను చూస్తే అర్థమవుతుంది. వకీల్ సాబ్ లాంటి పదునైన పాత్రలో పవన్ కళ్యాణ్ వార్నింగ్ లు ఇస్తుంటే ఇక సినిమాలో చూసి తట్టుకోగలమా? ఇప్పుడు ‘వకీల్ సాబ్’ సినిమా డబ్బింగ్ లో పవన్ అలాగే అదేవిధంగా గర్జిస్తున్నారట..

రాజకీయాల్లోకి వెళ్లి సినిమాలు వదిలేసిన పవన్.. దాదాపు మూడేళ్ల తరువాత పవన్ సినిమాలు చేయడంతో ఫ్యాన్స్ తో పాటు సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. అంతేకాకుండా వెండితెరపై పవన్ ను చూసేందుకు అభిమానులు ఉర్రూతలాడుతుండడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.

ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ తాజాగా ‘వకీల్ సాబ్’ సినిమా డబ్బింగ్ పనుల్లో పాల్గొన్నారు. తాజాగా ఆయన డబ్బింగ్ చెబుతున్న కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలోకి రావడంతో ఫ్యాన్స్ లో ఉత్సాహం నెలకొంది. దీంతో ఆ ఫొటోలను వైరల్ చేసేస్తున్నారు.

బాలీవుడ్ లో ఘన విజయం సాధించిన ‘పింక్’ సినిమాను తెలుగులో పవన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో రీమేక్ చేస్తున్నారు. ‘వకీల్ సాబ్’సినిమాను దిల్ రాజు, బోనీకపూర్ సంయుక్తగా నిర్మిస్తున్నారు. దాదాపు రూ.120 కోట్ల బిజినెస్ చేయబోతున్న ఈ సినిమా ఏప్రిల్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. పవన్ ఇందులో న్యాయవాదిగా కనిపించనున్నారు.

మూడేళ్లుగా కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ వచ్చే నెల 9న విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియాకు అందిస్తున్న చిత్రం యూనిట్ తాజాగా పవన్ డబ్బింగ్ చెబుతున్న కొన్ని ఫొటోలను రిలీజ్ చేశాయి. ప్రస్తుతం అవి నెట్టింట్లో వైరల్ గా మారాయి.