పొత్తులతో జనసేన పోటీ చేస్తే వైసిపి నేతలకు ఉలికెందుకు?

  • మంత్రి అమర్నాథ్ కుటుంబమే అసలైన జెండా కూలీలు
  • జనసేన పార్టీ అంతర్గత వ్యవహారాలపై అంత శ్రద్ద ఎందుకు
  • రాబోయే ఎన్నికల్లో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ తథ్యం

విశాఖపట్నం: పొత్తులతో జనసేన పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తే వైసిపి నేతలకు ఉలికెందుకని ఆ పార్టీ దక్షిణ నియోజక వర్గం నాయకులు పీవీ శివప్రసాద్ రెడ్డి అన్నారు. ఆదివారం ఉదయం నగరంలోని డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రంలో భవిష్యత్తు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, పొత్తులపై మాట్లాడిన వెంటనే మంత్రి అమర్నాథ్, పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు. ప్రజా సమస్యలపై కానీ తన మంత్రిత్వ శాఖపై ఏనాడూ స్పందిస్తూ పత్రికా సమావేశాలు ఏర్పాటు చేసి మాట్లాడని మంత్రి అమర్నాథ్ జగన్ మోహన్ రెడ్డి దగ్గర ప్రాపకం కోసం జనసేన పై విమర్శలు చేసేందుకు సిద్ధంగా ఉంటారన్నారు. జనసేన పార్టీ జనసైనికులను, వీరమహిళలను ఉద్దేశించి కూలీలు అని మాట్లాడారని మరి ఆ విషయానికి వస్తే గుడివాడ గురునాధ్ రావు ఉన్నపుడు కాంగ్రెస్ లో అయన తదనంతరం తెలుగుదేశంలో 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన జెండా కూలి కుటుంబం మీది కదా అసలైన జెండా కూలి కుటుంబ మీదే, ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాక్షస పాలన అంతం చేయాలనీ టీడీపీ – జనసేన – బీజేపీ కూటమితో ఎన్నికలకు వెళ్తాను అంటే ఎందుకు ఉలిక్కి పడుతున్నారన్నారు. 175/175 గెలిచేస్తాం అని మీ అధికనాయకుడు చెప్పిన మాట మీద మీకు నమ్మకం ఉంటే ఎందుకు కంగారు పడుతున్నారన్నారు. జగన్ మోహన్ రెడ్డి పాలనలో 4 సమస్యల ఉంటే చూపించాలని మంత్రి అమర్ అడుగుతున్నారు. 4 సమస్యలు కాదు 400 సమస్యలు చూపిస్తాం జనసేన పార్టీగా మీరి సిద్దమేనా, రాష్ట్రం వరకు అవసరం లేదు మంత్రి అమర్ తన సొంత నియోజకవర్గం ఐన అనకాపల్లి వేదికగా వున్నా వైసీపీ వైఫాల్యలు కూడా 40 కి పైగా చెప్తాం మరి చర్చకు సిద్దమేనా, జనసైనికులకు, నాయకులు ఉచిత సలహాలు ఇస్తున్న మంత్రి అమర్నాథ్ ముందు తన సంగతి ఏంటో చూసుకోవాలన్నారు. వచ్చే ఎన్నికల్లో కనీసం అనకాపల్లిలో కాదు జిల్లాలో ఎక్కడ గెలిచే పరిస్థితి లేదు. కాబట్టి ఇతర పార్టీలకు నీతులు, సుక్తులు చెప్పడం మానుకోవాలన్నారు. మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్లు కోసం మాత్రమే మాట్లాడే వైసీపీ నాయకులు అది తప్ప జనసేనాని ని విమర్శించేందుకు ఇంకో అంశం లేదు. ఈ స్క్రిప్ట్ 2019 ఎన్నికల్లో ఈ మాట ప్రజలు నమ్మారు కానీ ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో ప్రజలు ఆ మాటలు విశ్వశించారన్నారు. మంత్రి అమర్నాథ్ మాటలు అదుపులో పెట్టుకుంటే మంచిది, కచ్చితంగా రాబోయే ఎన్నికల్లో వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ గా చేసేందుకు పొత్తులు అనే అంశంతో పార్టీల యొక్క బాలబలాలు దృష్ట్యా ఎలా ఎన్నికలకు వెళ్తే మీకు ఏంటీ అని, పొత్తులు అనేవి సహజంగా రాజకీయాల్లో వ్యూహలను బట్టి పెట్టుకుంటారు అని దానికి అంత బాధ పడుతూ స్పందించాల్సిన అవసరం లేదు అని వైసీపీ నుండి కచ్చితంగా అధికారం కైవసం చేసుకుంటాం అని స్పష్టం చేశారు. . రాజకీయ పార్టీల్లో పొత్తులు కొత్త కాదని తెలిపారు. మంత్రి అమర్నాథ్ వైసిపిలో వుండి జనసేన గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. ఎవరో రిజిస్టర్ చేసుకున్న వైసిపి పార్టీని ఎలా కాజేశారో తెలీదా అంటూ, మీది అద్దె పార్టీ అని అమర్నాథ్ ని ఉద్దేశించి అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వమని పవన్ కల్యాణ్ ముందే చెప్పారని స్పష్టం చేశారు. చెప్పుదెబ్బలు తినే రోజులు అమర్నాథ్ కు దగ్గరలోనే వున్నాయని ఆయన జోష్యం చెప్పారు. తమ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ వెంటేనని, తమ మధ్య విభేధాలు తేవాలని చూసిన అవి చెల్లవని చెప్పారు. హత్యా రాజకీయాలు చేసేది మీ నాయకుడే అంటూ, పదవి పాకులాడింది ఎవరో అందరికీ తెలుసన్నారు. తండ్రి శవం వుండగానే సి.ఎమ్ కావాలని సంతకాలు సేకరించలేదా అని నిలదీశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్లీ చంచల్ గూడా జైలుకు వెళ్లడం ఖాయమని ఆయన స్పష్టం చేశారు. ఎప్పుడు ఏపార్టీలో వుంటారో ఏ జెండా మోస్తారో తెలీని వారు మీ పార్టీలోనే వున్నారని, మంత్రి అమర్నాథ్ ని ఎద్దేవా చేశారు. రానున్న ఎన్నికల్లో వైసిపి ఇంటికి వెళ్లిపోవడం ఖాయమని చెప్పారు. సమావేశంలో జనసేన కార్పొరేటర్ల అభ్యర్థులు గరికన రవి, యగ్నేశ్వరి, తెలుగు అర్జున్, జన సైనికులు ఆందోన, నరేంద్ర, చీకటి రమణ పాల్గొన్నారు.