*విప్ బొమ్మిడి నాయకర్ హెచ్చరిక
నరసాపురం పట్టణంలో సోమవారం పలు వార్డులు మరియు మార్కెట్ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, నరసాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్ ఆకస్మికంగా పర్యటించారు. మార్కెట్‌లో చేపల వ్యాపారులు, కిరాణా వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ సిబ్బందికి సమస్యలు పరిష్కరించాలని ఆదేశాలు ఇచ్చారు. తదనంతరం మున్సిపల్ ఆఫీస్‌లో కమిషనర్ ఎం. అంజయ్య గారి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పారిశుద్ధ్య సిబ్బంది హాజరును పరిశీలించగా, కొన్ని విభాగాల్లో సిబ్బంది విధులకు హాజరు కాలేదని గుర్తించారు. అలాగే, సచివాలయ సిబ్బంది ఆలస్యంగా విధులకు రావడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బంది పనితీరుపై విభాగాల వారీగా సమీక్ష నిర్వహించిన ఆయన, సమయపాలన పాటించని సిబ్బందిపై తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటూ విధుల్లో నిర్లక్ష్యం చూపించడం సహించబోదని హెచ్చరించారు. యువత మంచి భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.

Share this content:
Post Comment