ప్రజల పక్షాన పోరాటం చేస్తుంటే.. వైసీపీ నేతలకు భయం ఎందుకు ?:

పాడేరు: వైసీపీ ప్రభుత్వ ప్రజా ప్రతినిధులకు హెచ్చరిక మా జనసేన పార్టీ నుండి ప్రజల పక్షాన పోరాటం చేస్తూ.. గ్రామాలకు వెళ్లి ప్రజా సమస్యల కోసం అడిగి తెలుసుకుంటూ ఉంటే వైసీపీ ప్రజా ప్రతినిధులకు ఎందుకు మా పై మీకు భయం పుట్టుకొస్తుందని ? జనసేన పార్టీ పెదబయలు మండల అధ్యక్షులు జాగరపు పవన్ కుమార్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన్ మాట్లాడుతూ మా జనసేన నాయకులు ప్రతి గిరిజన గ్రామాలకు సందర్శించినప్పుడు ప్రజలు వారి యొక్క కష్టాలు చెప్పుకుంటున్నారు. ఏ గ్రామానికి వెళ్లినా సంతోషాలతో నిండిన జీవితాలు లేవు. గిరిజన గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యాలు లేక నిండు గర్భిణీ స్త్రీలు ప్రసవ వేదనతో డోలీ మోతల దగ్గరే పసిబిడ్డ తల్లి బలవుతున్నారు. ఇలాంటి సమస్యలు మీ కంటికి కనిపించటం లేదా..?. మంచినీరు సదుపాయం లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. స్వచ్ఛమైన నీరు లేక గ్రామస్తులు కలిసితమైన నీరు చిన్న పెద్దలు తాగి విష జ్వరాలు అనేక రోగాలతో మరణిస్తున్నారు. ఇది వైసిపి ప్రతినిధులకు కనిపించడం లేదా?. విద్య అనేది పూర్తిస్థాయిలో గిరిజన గ్రామాలకు అందటం లేదు. చదువుకోటానికి సరైన పాఠశాల బిల్డింగ్స్ లేవు. కనీస సౌకర్యాలు లేక గిరిజన విద్యార్థులు మరణానికి ఎవరు బాధ్యులు ఈ ప్రభుత్వనిది కాదా గిరిజన బిడ్డలు వారి యొక్క రైతు పని చేసుకుంటూ వారి పిల్లలకు డిగ్రీ, డైట్ ఇలా మంచి చదువులు వారి యొక్క కష్టార్జితం పెట్టి చదివిస్తున్నారు కానీ ఫలితం లేదు. మెగా డిఎస్సీ అన్నారు ఇలా మాయ మాటలు చెప్పి మా గిరిజన బిడ్డలకు అమాయకులగా చేస్తుంది. ఈ వైసీపీ ప్రభుత్వం నాలుగేళ్లు గడుస్తున్నా జాబ్ క్యాలెండర్ ఎక్కడ..?. మీ వైసీపీ క్యాలెండర్ మారుతుంది కానీ మీరు గిరిజన బిడ్డలకు మాట ఇచ్చిన జాబ్ క్యాలెండర్ ఏమైంది. విద్య అభివృద్ధి అంటున్నారు బోధించే ఉపాధ్యాయులు లేకుండా ఎలా విద్యాభివృద్ధి జరిగింది. నూతన ఉపాధ్యాయుల నియామకలు ఎక్కడ ఇలాంటి సమస్యలతో గిరిజన బిడ్డలు నలిగిపోతుంటే మీకు ఈ సమస్యలు పట్టవా..?. ప్రజా సమస్యలపై పోరాడి ప్రభుత్వాన్ని తెలియజేసే పనిలో మా జనసేన పార్టీ నాయకులు అరకు ఇన్చార్జ్ డా. వంపూరు గంగులయ్య గారిపై మరియు మా జనసేన నాయకుల మీద అర్థంపర్థం లేని విమర్శాలు ఎందుకు? వాస్తవానికి 2023 మార్చి 24వ తేదీన గిరిజన ప్రజల్లో వైసీపీ ప్రభుత్వం, పార్టీ ఆ రోజే సమాధి కాబడింది కేవలం జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడం కోసం గిరిజన ప్రజల్ని ఏమార్చి తప్పుదోవ పట్టిస్తారా?.. గిరిజన ప్రజలు అంత ఈజీగా నమ్మేస్తారని అనుకుంటున్నారా? ప్రభుత్వంతో మీరు చేసుకున్న లోపాయకారి ఒప్పందాలు ప్రజలకు తెలియకుండా అసెంబ్లీలో మౌనవ్రతం పాటించి గిరిజన ద్రోహులుగా ఎందుకు అంతకు తెగించారు. ఇది కంచె చేను మేయడం వంటి విద్రోహపు చర్య కాదా?.. మీరు జాతికి ద్రోహులు కారా?.. అసలు జాతి ప్రయోజనం కోసం మీరు చేస్తున్న పోరాటాలు ఏమిటి?. జాతి ప్రయోజనం కోసం మీరు ఏ త్యాగం చేస్తున్నారు?. గ్రామ పంచాయితీ ప్రధమ పౌరుడైన చర్పంచ్ అధికారులకు తూట్లు పొడిచి నేటికి పంచాయితి గ్రామాభివృద్ధి పంచాయితి వ్యవస్థని నిర్వీర్యం చేయడంలో మీరు కూడా ప్రభుత్వం తరపున పాత్రధారులు కాదా..? లేక ప్రభుత్వం ఏమిచేసిన మాకు ఇష్టమేనని బానిసత్వం ప్రకటించుకున్నారా?. ఇవాళ ప్రభుత్వం సర్పంచ్ లకు ప్రజల ముందు తల ఎత్తుకోలేని పరిస్థితులు మీ ప్రభుత్వం చెయ్యలేదా..?. ఆత్మహత్యలు చేసుకున్న సర్పంచ్ లను మీరు చూడలేదా..? అంటూ జనసేన తరఫున జనసేన నాయకులు ప్రశ్నించారు. బహిరంగ చర్చకు జనసేన పార్టీ నాయకులు ఎ క్షణం అయినా సిద్ధం మీరు సిద్ధమేనా అని జనసేన పార్టీ పెదబయలు మండల అధ్యక్షులు జాగరపు పవన్ కుమార్ ప్రశ్నించారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ నాయకులు మనోజ్ కుమార్, వెంకీ, మహేష్, చందు, హరీష్, మహి, బుజ్జి తదితరులు పాల్గొన్నారు.