చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ 15 వేలకు జీతం పెంచాలి: హిందూపురం జనసేన

హిందూపురం, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మను వాలంటీర్ల ముసుగులో హిందూపురంలో వైసీపీ నాయకులు దహనం చేయడాన్ని ఖండిస్తూ హిందూపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ ఆకుల ఉమేష్ ఆధ్వర్యంలో హిందూపురం పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ లో నిరసన కార్యక్రమం నిర్వహించి పవన్ కళ్యాణ్ చిత్రపటానికి 101 కొబ్బరికాయలతో దిష్టి తీసి, పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆకుల ఉమేష్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ వాలంటీర్ల వ్యవస్థను అడ్డుపెట్టుకొని వైసీపీ నాయకులు చేస్తున్న అరాచకాలు, రాష్ట్రంలో కనిపించకుండా పోయిన 30 వేల మంది అడబిడ్డల ఆచూకీ ఎక్కడ అని నిలదీసిన పవన్ కళ్యాణ్ పై వాలంటీర్ల ను ముందుపెడుతూ వైసీపీ నాయకులు వెనకనుండి అరాచకాలు సృష్టించడాన్ని వాలంటీర్లు గ్రహించాలని, వైసీపీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వాలంటీర్ల పై చిత్తశుద్ధి ఉంటే వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ 15 వేలకు జీతం పెంచాలని డిమాండ్ చేశారు. డిగ్రీలు చదివిన వారికి చాలీచాలని జీతం 5 వేల రూపాయలు ఇచ్చి వెట్టిచాకిరి చేయిస్తున్నది ఎవరో వాలంటీర్లు గుర్తించాలని ఈ సందర్భంగా తెలియచేసారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి ఎల్.ఐ.సి రమణ, హిందూపురం పట్టణ అధ్యక్షుడు కొల్లకుంట శేఖర్, నాయకులు ఎం.ఎం మంజునాథ్, బొంచేరువు భాస్కర్, గాజుల నాగభూషణం, విజయ్, ప్రభుదాస్, నవీన్ సంజు, ఆంజనేయులు, జయచంద్ర, మనోహర్, లక్ష్మణ మూర్తి, ధర్మేంద్ర, మునీర్, శ్రీనివాస రెడ్డి, లింగరాజు,మౌలి నాథ్, మంజు, బాబు, తిరుమలేష్, కృష్ణారెడ్డి, నరసింహ రెడ్డి, సోము, ఆనంద్, ప్రభు, అస్వార్థ, విజయ్, వెంకీ, తిమ్మరాజు, వేణుగోపాల్, మారుతీ, ధనంజి, రాఘువ అరవింద్, జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.