కార్మికుల జీతాలు ఇవ్వకుంటే ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం: మరీదు శివరామకృష్ణ

నూజివీడు: చాట్రాయి మండలం, చనుబండ పంచాయతీ, చనుబండ గ్రామానికి చెందిన 6గురు పారిశుధ్య కార్మికులకు విస్సంపల్లి రమేష్, కారుమంచి బిక్షాలు, మొద్దు మరియమ్మ, విస్సంపల్లి ప్రసాదరావు, అను వీరు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన చెత్త సంపద కేంద్రం నందు నెలకు 6000/-రూపాయల జీతానికి పాత ఎంపిడిఓ నాగేశ్వరావు ద్వారా నియమింపబడినారు. మొదటిలో 2 నెలల జీతం ఇచ్చారురు. ఇంకా 39 నెలల జీతం అక్షరాలా 14 లక్షలు రావలసి ఉంది. మేము గ్రామ సెక్రటరీ నాగరాజు ని ప్రశ్నించగా మా జీతాలు ఇవ్వకుండా వేరేవారిని విధులలోకి తీసుకున్నారు. సోమవారం సబ్ కలెక్టర్ ఆఫీస్ లో జరిగిన ధర్నా కార్యక్రమంలో 15 రోజులలో కార్మికుల జీతాలు ఇవ్వకుంటే సబ్ కలెక్టర్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేస్తాం అని జనసేన ఉమ్మడి కృష్ణాజిల్లా అధికార ప్రతినిధి మరీదు శివరామకృష్ణ హెచ్చరించారు. రాజన్న రాజ్యంలో పేదలు ఎస్సీ కమ్యూనిటీకి చెందిన పని చేయించుకొని 39 నెలలు పని చేయించుకుని జీతాలు ఇవ్వకపోవటం సిగ్గుచేటు అన్నారు. దీనిపై నూజివీడు ఎమ్మెల్యే జోక్యం చేసుకోవాలని కోరారు ఎస్సీ ఆత్మీయ కలయికలు పెడుతున్న నూజివీడు ఎమ్మెల్యే ఎస్సీలకు అన్యాయం జరిగితే పట్టించుకోవటం లేదని విమర్శించారు. చాట్రాయి మండల ప్రధాన కార్యదర్శి మొఒడ్రు సురేష్ మాట్లాడుతూ దళితులపై ఇటువంటి అన్యాయాలు జరిగితే ఊరుకునేది లేదని వెంటనే వారికి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విజయవాడ మండల ప్రధాన కార్యదర్శి లంకే సురేష్, చల్లపల్లి నవీన్, విస్సంపల్లి రాజా మరియు బాధితులు పాల్గొన్నారు.