మాచర్ల వద్ద ఘనంగా వరికపుడిశెల ఎత్తిపోతలకు శంకుస్థాపన?

  • ఎన్నికల ముందు టెంకాయ కొడితే దానిని మోసం అంటారు

అనంతపురం: ఎన్నికలకు ఆరు నెలల ముందు టెంకాయ కొడితే దానిని మోసం అంటారని అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియా ముఖంగా మాట్లాడుతూ.. ఐదు సంవత్సరాలు పాలించేందుకు ప్రజల అధికారం ఇస్తారు. నాలుగున్నర ఏళ్ల పాటు ఏమీ చేయకుండా ఎన్నికలకు ఆరు నెలల ముందు టెంకాయ కొడితే “దానిని మోసం అనే” అంటారని అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే టెంకాయ కొడితే దాన్ని చిత్తశుద్ధి అంటారు.. 2019 డిసెంబరు 23న కడప జిల్లా నందు ఉక్కు పరిశ్రమ శంకుస్థాపన సభలో మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్న మాటలు ఇవి. అయ్యా ముఖ్యమంత్రి గారు ఎన్నికలకు ఇక నాలుగు నెలలే సమయం మిగిలి ఉంది… మరి మీరు ఇప్పుడు శంకుస్థాపనల పేరుతో హడావుడి చేస్తూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారా? అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకే టెంకాయ కొట్టి శంకుస్థాపన చేసిన కడప ఉక్కు పరిశ్రమ సంగతి ఏంటి? ఉక్కుపరిశ్రమ స్థాపించారా? ఇప్పుడు ఏ దశలో ఉందో రాష్ట్ర ప్రజలకు వివరించగలరా?. జగనన్న విద్యా కానుక కిట్ల సరఫరాలో 120 కోట్ల కుంభకోణం జరిగిందంట కదా? కిట్ల రూపంలో పిల్లలకు అందజేస్తున్న బూట్లు, బ్యాగులు లాంటివన్నీ ఢిల్లీ, యూపీ రాష్ట్రాల నుండి సప్లై చేస్తున్నది( లిక్కర్ లాంటి) మీ బినామీ కంపెనీలే అంట కదా? ఈడి దాడుల్లో ఈ విషయాలు అన్ని బయటపడ్డాయి అంట కదా? జనసేన నేత పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు అడిగిన వాటికి మీరు సమాధానం చెప్పగలరా? ఇండోసోల్ 5,148 ఎకరాలు కట్టబెట్టింది చాలదని మరో 3,200 ఎకరాలు కట్టబెట్టాలని చూస్తున్నది వాస్తవం కాదా? ఇండో సోల్ కు మదర్ సమస్త కడప షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీ నే కదా? వీటన్నిటికీ సమాధానం చెప్పాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామని కుంటిమద్ది జయరాం రెడ్డి పేర్కొన్నారు.