దమ్ముంటే జనసేనానిలా రైతులకు సాయం చేయడంలో పోటీ పడండి..

మంత్రి ధర్మాన ప్రసాదరావు గారు మీకు దమ్ముంటే పవన్ కళ్యాణ్ గారి లాగా ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులకు ఆర్థిక సాయం చేయడంలో పోటీ పడండి అని జనసేన పార్టీ 7వ డివిజన్ జనసేన నాయకులు దోమకొండ అశోక్ సవాల్ విసిరారు.

ఈ సందర్బంగా అశోక్ మాట్లాడుతూ.. అయ్యా మంత్రి ధర్మాన ప్రసాదరావు పవన్ కళ్యాణ్ గారుతో నడకలో పోటీ పడటం కాదు.

మీకు దమ్ముంటే పవన్ కళ్యాణ్ గారి లాగా రైతులకు ఆర్థిక సాయం చేయడంలో పోటీ పడండి.

మీరు నడవడంలో దిట్ట అయితే ఒలంపిక్స్ కి పంపిస్తాం కనీసం ఆంధ్రప్రదేశ్ పరువైనా నిలబడుతుంది.

మీరు గతంలో విశాఖ భూముల స్కామ్ విషయంలో ఎదుర్కొన్న ఆరోపణల విషయంలో అయితే మేము మీతో పోటీ పడలేము.
మీరు సీనియర్ నాయకులు అయ్యుండి, మీ పార్టీ లో కొంతమంది పవన్ కళ్యాణ్ గారి మీద పనికిమాలిన వ్యాఖ్యలు చేసే పనికిమాలిన నాయకులు లాగా కాకుండా ఉన్నతంగా మాట్లాడాలని జనసేన పార్టీ 7వ డివిజన్ జనసేన నాయకులు దోమకొండ అశోక్ ఎద్దెవా చేసారు.