పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని జనసేన మండల కన్వీనర్ కోడి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక జామియా మసీదులో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. మండల కమిటీ నాయకుల సహకారంతో నిర్వహించిన ఈ విందు కార్యక్రమానికి జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ.. పవిత్ర రంజాన్ మాసంలో ఎంతో నిష్ఠతో ఉపవాసం పాటిస్తున్న ముస్లిం సోదరులకు ఆత్మీయ విందు ఏర్పాటు చేయడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు. రంజాన్ మాసంలో ముస్లిం సోదరుల కోరికలు ఫలించాలని, అలాగే కుల, మత భేదాలకు అతీతంగా రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థనలు చేయాలని ముస్లిం పెద్దలను కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల ఉపాధ్యక్షులు జాకీర్ హుస్సేన్, ప్రధాన కార్యదర్శులు పప్పు వెంకటేష్, మధుఅచారి, గుండ్లశివ, అల్లా ఓబయ్య, బాబు, శివకుమార్, సోమరాజేష్, నాగభూషణ్, మణి తదితర జనసేన నాయకులు, ముస్లిం మత పెద్దలు, జనసైనికులు పాల్గొన్నారు. విందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ జనసేన తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
Share this content:
Post Comment