హుజూర్నగర్ జనసేన ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు

హుజూర్నగర్ నియోజకవర్గం గరిడేపల్లి మండల పరిధిలో హుజూర్నగర్ నియోజకవర్గం కోఆర్డినేటర్ సరికొప్పుల నాగేశ్వరరావు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. ముస్లిం సోదరులు ఎంతో నియమనిష్ఠలతో చేపట్టే దీక్ష ఎంతో పవిత్రమైనది అని మాట్లాడి ఈ అవకాశం కలిపినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ ముస్లిం సోదరులకు ముందుగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. జనసేన పార్టీ తరఫున అధినేత పవన్ కళ్యాణ్ తరపున రాష్ట్ర నాయకుల తరపున రంజాన్ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఇఫ్తార్ అనంతరం గరిడేపల్లి మండల జనసైనికులతో పార్టీ విధివిధానాలపై గ్రామాల్లో బలంగా పార్టీ అభివృద్ధిపై సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు దాసరి వాసు రాకేష్, నరసింహాచారి జంపాల సతీష్ నరేష్, కర్ణాకర్ బిక్షం అంజితో పాటు ముస్లిం సోదరులు పాల్గొన్నారు.