హుజుర్నగర్ పట్టణంలోని దద్దనాలా చెరువులోగల మస్జీద్-ఏ-ఇనాయత్ లో జనసేన పార్టీ నాయకులు షేక్ హసన్ మియా ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు అల్పాహార విందు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్బంగా జనసేన పార్టీ నాయకులు షేక్ హసన్ మియా, సైదులు యాదవ్ మాట్లాడుతూ… ముస్లిం సోదరులు అత్యంత పవిత్రమైన రంజాన్ నెలలో ప్రతి సంవత్సరం జనసేన పార్టీ తరుపున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తునామని చెప్పారు. అదేవిధంగా ఈ మసీద్ కి జనసేన పార్టీ నాయకులు షేక్ హసన్ మియా తనవంతుగా కొద్ది విరాళం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలతో పాటు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.
Share this content:
Post Comment