జనసేన నేత యడ్లపల్లి రామ్ సుధీర్ అక్రమ అరెస్ట్

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు వర్షంలో మునిగిన జగనన్న కాలనీల సందర్శనలో భాగంగా శనివారం పెడన నియోజకవర్గంలో జనసేన నాయకులు యడ్లపల్లి రామ్ సుధీర్ చేస్తున్న #Failure of Jagananna Colony కార్యక్రమం పెడన పట్టణంలో అడ్డుకుని పోలీసులు పైడమ్మ లే అవుట్ జగన్నన్న కాలనీ వద్దకు వెళ్ళవద్దు అంటూ రామ్ సుధీర్ ను, జనసేన నాయకులను అక్రమ అరెస్టులు చేశారు.
అరెస్ట్ చేసి పెడన లోనే రెండు మూడు సార్లు జీపును వెనక్కి తిప్పి గందరగోళం సృష్టించారు. రామ్ సుధీర్ వెంటే జనసైన్యం కార్లు, బైకులతో వెంబడించారు. రామ్ సుధీర్ ను పెడన నుంచి గుడివాడ మీదుగా గన్నవరం సమీపంలోని ఉంగుటూరు పోలీస్ స్టేషన్ కు తరలించారు. పెడన నుంచి ఉంగుటూరు వరకూ జనసైన్యం జై జనసేన జై పవన్ అన్న, జై యడ్లపల్లి నినాదాలతో హోరెత్తించారు.. బయటికి వచ్చిన అనంతరం రామ్ సుధీర్ మాట్లాడుతూ.. మా పార్టీ తరపున రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం చేస్తుంటే గృహ నిర్మాణ శాఖ మంత్రి గారికి ఇంత ఉలుకు ఎందుకన్నారు, నిత్యం పవన్ కళ్యాణ్ గారిని తిట్టే ఈ గృహ నిర్మాణ శాఖ మంత్రి సొంత నియోజక వర్గంలో జగనన్న కాలనీలలో అవినీతి జరగకపోతే, వర్షాలకు నీట మునగక పోతే అన్నీ సక్రమంగా ఉంటే భయమెందుకన్నారు ? నేడు మేము సందర్శించడానికి వెళుతుంటే పోలీసులను అడ్డు పెట్టి ఎందుకు అక్రమ అరెస్టులు చేశారని ప్రశ్నించారు. జోగి రమేష్ కి జోకర్ లాగా మాట్లాడటమే తప్ప జగనన్న కాలనీలు ఎలా అభివృద్ది చేయాలి అనేది మాత్రం చేత కాదన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పోలగాని లక్ష్మీ నారాయణ, పుల్లేటి దుర్గా రావు, క్రోవీ సుందర రాజు, వరుదు రాము, బాకీ హరీష్, సింగంసెట్టు అశోక్ కుమార్ పలువురు నాయకులు జనసైనికులు పాల్గొన్నారు. ఉంగుటూరు పోలీస్ స్టేషన్ లో ఉన్న రామ్ సుధీర్ ను గుడివాడ నియోజకవర్గం జనసేన నాయకులు సందు పవన్, పామర్రు ఇంఛార్జి తాడిసెట్టి నరేష్, నూజివీడు జనసేన నాయకులు బర్మా ఫణి రామ్ సుధీర్ ని పరామర్శించి విడిచే వరకూ రామ్ సుధీర్ తోనే ఉన్నారు.