ఒంగోలులో జనసేన నాయకుల అక్రమ అరెస్టు

విశాఖపట్టణం, ఆదివారం విశాఖపట్టణంలో ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న జనసేన భరోసా జనవాణి కార్యక్రమానికి శనివారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో పాటూ జనసేన శ్రేణులు భారీ ఎత్తున విశాఖ పట్టణం చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంలో పోలీసులు జనసేన నాయకులను అక్రమ అరెస్టులు చేయడం జరిగింది. ఆ అక్రమ అరెస్టులను ఖండిస్తూ జనసేన నాయకుల అరెస్టుకు నిరసనగా ఒంగోలులోని జనసేన నాయకులు, వీర మహిళలు, జనసైనికులు చేస్తున్నటువంటి ధర్నాని పోలీసులు అడ్డుకొని అరెస్టు చేసి ఒంగోలు తాలూకా స్టేషన్ కి తరలించడం జరిగింది.