జనసేన నాయకుల అక్రమ అరెస్ట్ – అల్లవరం స్టేషన్ కి తరలింపు

అమలాపురం: ప్రతిపక్ష నాయకుడు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ సోమవారం తలపెట్టిన రాష్ట్ర బందుకు రాష్ట్ర జనసేన పార్టీ అద్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు శాంతియుతంగా బంద్ లో పాల్గొనడానికి వెళుతున్న జనసేన పార్టీ నాయకులు లింగోలు పండు, యాళ్ళ నాగ సతీష్, కంకిపాటి గోపి, నల్లా వెంకటేశ్వరరావు, కొప్పుల నాగ మానస, తిక్క సరస్వతి, నల్లా చిన్న, నిమ్మకాయల రాజేష్ తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకుని అల్లవరం స్టేషన్ కి తరలించారు.