ప్రజా సమస్యలపై పోరాడుతున్నందుకే జనసేన నాయకులపై అక్రమ అరెస్టులు

గురజాల నియోజవర్గం: పిడుగురాళ్ల మండల పార్టీ ఆఫీస్ నందు గురువారం జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో మండల అధ్యక్షులు కామిశెట్టి రమేష్ మాట్లాడుతూ.. అక్రమ అరెస్టులతో జనసేన నాయకులకు భయపడలేరని, బైపాస్ పనులు ఎప్పుడు పూర్తి చేస్తారో తెలియజేయమంటే సమాధానం చెప్పడం చేతకాక, దొంగ దీక్షలతో ప్రజలను మభ్యపెట్టి కాలం గడుపుతున్నారని, ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేసే హక్కుని కాల రాస్తున్నారని దుయ్యబట్టారు. జిల్లా సంయుక్త కార్యదర్శి దూదేకుల కాసిం సైదా మాట్లాడుతూ.. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పరదాలు కట్టుకొని రాజకీయం చేస్తూ ఉంటే, కాసు మహేష్ రెడ్డి గారు పోలీసులని అడ్డం పెట్టుకొని, వారి కాలాన్ని వృధా చేస్తున్నారని తెలియజేశారు అక్రమ అరెస్టులతో జనసైనికుల మనోధైర్యాన్ని దెబ్బతీయలేరని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షుడు బయ్యవరపు రమేష్, ప్రధాన కార్యదర్శి ఆవుల రమేష్, గుర్రం కోటేశ్వరరావు, కార్యదర్శి బేతంచర్ల నాగేశ్వరరావు, జానపాడు గ్రామ అధ్యక్షుడు పసుపులేటి నరసింహారావు, గ్రామ ప్రధాన కార్యదర్శి అంబటి సాయి, నాయకులు బేతంచర్ల ప్రసాద్, షేక్ సైదా, లక్ష్మణ్, రమేష్, పరమేష్, గోపి, మొదలువారు పాల్గొన్నారు.