అక్రమ కట్టడాలను తొలగించాలని జనసేన వినూత్న నిరసన

పశ్చిమ గోదావరి జిల్లా, పాలకోడేరు మండలం, పెన్నాడ అగ్రహారంలో తల్లికోడు పిల్లకోడు మురుగు డ్రైన్ పూడిక తీసి, కాలువ గట్లపై కట్టిన అక్రమ కట్టడాలను తొలగించాలంటూ పెన్నాడ గ్రామ జనసేన పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి డ్రైనులో దిగి వినూత్న నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.