నిబంధనలకి విరుద్ధంగా మట్టి అక్రమ తవ్వకాలు

తాడికొండ నియోజకవర్గం, తాడికొండ మండలంలో గల లచ్చనగుడిపూడి గ్రామంలో నిబంధనలకి విరుద్ధంగా మట్టి అక్రమ తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాన్ని ఉమ్మడి గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు సందర్శించారు. ఈ సందర్భంగా గాదె మాట్లాడుతూ మైనింగ్ నిబంధనల ప్రకారం 20 అడుగులు తవ్వాలి, అలాగే చుట్టూ బఫరింగ్ జోన్ 7 మీటర్లు వదిలిపెట్టాలి కానీ అలాంటి చర్యలు ఏమి తీసుకోకుండా వాళ్ళ ఇస్టానుసారంగా తవ్వేస్తునారు. కానీ ఇంత జరుగుతున్నా అధికారుల పర్యవేక్షణ లేదు ఈ మైనింగ్ వల్ల చుట్టు బోర్లు అడుగంటే పరిస్థితి దాపరించింది. అధికారులు ఇకనైనా నిద్ర లేచి ఎక్కడ అక్రమ మైనింగ్ జరుగుతుందో చూసి సరైన చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజులలో జనసేన పార్టీ తరపున పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరుగుతుంది అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తాడికొండ సమన్వయ కర్త విజయ్ శేఖర్, జిల్లా ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు, మండల అధ్యక్షులు గులకవరపు నరేష్, రాచర్ల నాగబాబు, నాగరాజు, మండల కార్యదర్శి రామినేని సాంబశివరావు మరియు ఇతర నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.