కొడవలి గ్రామ పరిధిలో అక్రమ మైనింగ్ ను నిలిపివేయాలి: జ్యోతుల, అమరాధి వల్లి

  • కొడవలి గ్రామ పరిధిలో అక్రమ మైనింగ్ ను తక్షణం నిలిపివేయాలని గొల్లప్రోలు తహశీల్దారుని కోరిన జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు, అమరాధి వల్లి రామకృష్ణ

పిఠాపురం: జనసేన నాయకులు జ్యోతుల శ్రీనివాసు, గొల్లప్రోలు మండల జనసేన అధ్యక్షులు అమరాధి వల్లీ రామకృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం జనసైనికులు, జనసేన నాయకులు గొల్లప్రోలు తహశీల్దారు కార్యాలయానికి చేరుకొని గొల్లప్రోలు తహశీల్దారుతో కొడవలి గ్రామంలో 133/1 సర్వేనెంబర్ నందు అక్రమంగా మైనింగ్ చేయుటకు ప్రయత్నం చేయుచున్నారని ఆ ప్రయత్నాన్ని తక్షణం ఆపుజేయాలని, కొడవలి గ్రామంలో గల నిరుపేదలకు 370 ఎకరాల భూమిని పట్టాలు చేసి ఇవ్వాలని అదే విధంగా అదే కొండపైనే గల గౌతమ బుద్ధుని ధాతు గర్భ స్తూపమును కాపాడాలని, సర్వే నెంబరు 133/1 నుండి పోలవరం కాలువకు తగు రక్షణ కల్పించాలని, ఇవన్నీ కూడా మరిచి అక్రమంగా మైనింగ్ చేయకు చేసుకొనుటకు కొంతమంది అధికారులు సహకరించారని తప్పుడు అనుమతులు ఇవ్వడం వల్ల కొడవలి గ్రామం, కొడవలి చుట్టుపక్కల గ్రామాలకు తీరని అన్యాయం జరుగుతుందని, లక్షల టన్నుల్లో గ్రావెలను ఈ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు మైనింగ్ చేసుకునేవారు తరలించుకుని పోతారని, దీనివల్ల ప్రాంతీయ అసమానతులు ఏర్పడతాయని జ్యోతుల శ్రీనివాసు తీవ్రంగా అధికారులపై ద్వజమెత్తెరు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన జనసేననాయకులు, జనసైనికులు, కార్యకర్తలు తహశీల్దారుకి ఫిర్యాదును అందజేశారు. ఈ కార్యక్రమంలో కొడవలి గ్రామానికి చెందిన రెడ్నం సూరిబాబు, చేబ్రోలు గ్రామానికి చెందిన జనసేన నాయకులు అల్లం దొరబాబు, దమ్ము చిన్న, తాటిపర్తి గ్రామానికి చెందిన సాదా గణేష్, దుర్గాడ గ్రామానికి చెందిన మొగలిశీను, మేడిబోయిన శ్రీను, గొల్లపల్లి గంగ, వెలుగుల లచ్చబాబు, కీర్తి చిన్న, జ్యోతులసీతారాంబాబు, వెదురుపాక దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.