*మైనింగ్ మాఫియాపై జనసేన ఆగ్రహం
రాజన్నపేట, రోలుగుంట మండలం రాజన్నపేట గ్రామంలోని సాగునీటి చెరువులో మైనింగ్ మాఫియా మరోసారి రెచ్చిపోయింది. ఇంతకుముందు తహసీల్దార్ చర్యలతో కొంత భాగం తొలగించబడిన అక్రమ రహదారి, అధికార నోటీసులను సైతం లెక్కచేయకుండా మళ్లీ నిర్మించబడింది. ఈ విషయంపై స్థానికుల సమాచారంతో చోడవరం జనసేన పార్టీ ఇంచార్జ్ పివిఎస్ఎన్ రాజు స్పందించి, రోలుగుంట తహసీల్దార్‌కు సమాచారం ఇచ్చారు. మైనింగ్ లీజుదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మీడియాతో మాట్లాడిన పివిఎస్ఎన్ రాజు, “ప్రజల ఫిర్యాదులపై అధికారులు పూర్తిస్థాయి చర్యలు తీసుకోవడంలో విఫలమవడం బాధాకరం. ప్రభుత్వం సుశాసనానికి కృషి చేస్తుంటే, నేలవీరిస్తున్న అక్రమాలపై ఎందుకు చర్యలేమి?” అని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై నర్సిపట్నం రెవెన్యూ డివిజనల్ అధికారి, అనకాపల్లి నీటిపారుదల శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఇకపై జాప్యం జరిగితే ఈ విషయం ప్రభుత్వ ప్రధానాధికారుల దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు.
Share this content:
Post Comment