అక్రమాలు, కబ్జాలు అరికట్టాలి: విసినిగిరి శ్రీనివాసరావు

చీపురుపల్లి, పట్టణంలో జనసేన పార్టీ కార్యాలయంలో శనివారం నియోజకవర్గ ఇంచార్జ్ విసినిగిరి శ్రీనివాసరావు మీడియా సమావేశం ద్వారా విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గ నాలుగు మండలాల్లో రోజురోజుకి అక్రమాలు, కబ్జాలకు ప్రభుత్వ భూమి ఆక్రమికు గురవుతుందని పట్టించుకునే నాధుడే లేకుండా పోయాడని ప్రజలు వాపోతున్నారని అన్నారు. అధికారులకు చీమకుట్టినట్లు కూడా లేదని ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు కనుక ఇప్పటికైనా రెవెన్యూ, ఇరిగేషన్ యంత్రాంగం వీటిపై దృష్టి పెట్టాలని ప్రభుత్వాన్ని చెడ్డపేరు తేకండి చూడాలని తెలిపారు. చీపురుపల్లి మండలంలో సాక్షాత్తు అమ్మవారి టెంపుల్ వెళ్లే దారిలో పక్కన అక్రమ కట్టడాలు జరుగుతున్నాయని, ఎంపీడీవో ఆఫీస్ ఎదురుగా సొసైటీ షాపులు బాల భవన్ ఖాళీ స్థలంలో నిర్మాణాలు చేస్తున్నారని మరియు పులకడ చెరువు దగ్గర తోటపల్లి కాలువ రాజాం రోడ్డు లైన్ లో ఆక్రమణకు గురైందని, గత ఐదు సంవత్సరాల్లో నియోజకవర్గ, మండలంలో ఉపాధి హామీ ద్వారా చెరువు పనులు చేపట్టినవి గత వైసీపీ ప్రభుత్వంలో ఆక్రమణకు గురయ్యాని రాయవలస పంచాయతీ నాగంపేట సుమారు 11ఎకరాలు 80 సెంట్లు ఆక్రమణకు గురైందని కనుక నియోజవర్గంలో గత ఐదు సంవత్సరాలు ఏ చెరువులకు ఉపాధి హామీ ద్వారా పనులు చేపట్టలేదు ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యే నూతన పనుల్లో ఆ చెరువుల్లో పని పెట్టాలని సంబంధిత ఎంపీడీవోలు, ఉపాధి హామీ ఏపీఎంలు బాధ్యత తీసుకొని గ్రామ అభివృద్ధిలో వర్షాకాలం నాటికి చెరువులన్నీ నిండేలా ప్రణాళికవేయాలని తెలిపారు.

Share this content:

Post Comment