అక్రమంగా అరెస్టు చేసిన జనసేన నాయకులను విడుదల చేయాలి

  • ఉమ్మడి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు తీగల చంద్రశేఖర్ డిమాండ్

గూడూరు పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం మీడియా సమావేశం నిర్వహించారు. జనసేన పార్టీ అధినేత విశాఖపట్టణంలో మూడు రోజుల పాటు చేపట్టిన ఉత్తరాంధ్ర పర్యటన కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు వైసీపీ ప్రభుత్వం పోలీసుల ద్వారా అరాచకాలు చేయడాన్ని ఆయన తప్పుపట్టారు. శనివారం వైసిపి ఆధ్వర్యంలో జేఏసీ ముసుగులో విశాఖపట్నంలో రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వారు తలపెట్టిన గర్జన కార్యక్రమం విజయవంతం కాకపోవడంతో జనసేన అధినేత విశాఖకు వచ్చిన సందర్భంగా జనసేన కార్యకర్తలు నాయకులు లక్షలాది మంది తరలి వచ్చి ఘనస్వాగతం పలికి ర్యాలీ నిర్వహించడంతో ఓర్చుకోలేని వైసిపి నాయకులు పోలీసుల ద్వారా జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులను అక్రమంగా అరెస్టు చేసి ఎక్కడికి తరలించారో కూడా తెలియని పరిస్థితి నెలకొందన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైజాగ్ పట్టణాన్ని వదిలి వెళ్లిపోవాలని పోలీస్ అధికారులు 41 ఏ నోటీసు జారీ చేయడం విడ్డూరంగా ఉందన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనను అడ్డుకునేందుకు వైసిపి కోడి కత్తి డ్రామాను గుర్తు చేస్తూ మంత్రులపై జనసేన పార్టీ కార్యకర్తలు దాడులు చేశారని అవాస్తవాలు చెబుతూ అక్రమ అరెస్టులకు పాల్పడడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. అనంతరం జనసేన పార్టీ నాయకులు క్రాంతి కుమార్, వాసు మాట్లాడుతూ పోలీసులు వైసీపి నాయకుల ఒత్తిళ్లతో జనసేన నాయకులను వేధింపులకు గురిచేయడం సరికాదన్నారు. రాష్ట్రంలోని ప్రజలందరూ వైసీపీ ప్రభుత్వ చేస్తున్న అరాచకాలను గమనిస్తున్నారని రాబోయే ఎన్నికల్లో సరైన గుణపాఠం చెబుతారన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు అక్బర్ కుమార్, రాజశేఖర్, కిషోర్, నాగమణి, శివ తదితరులు పాల్గొన్నారు.