శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవంలో పాల్గొన్న ఇమ్మడి కాశీనాథ్

ప్రకాశం జిల్లా, తర్లుపాడు గ్రామం నందు జరిగిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి వారి బ్రహ్మోత్సవం కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ మార్కాపురం నియోజకవర్గ ఇంచార్జ్ ఇమ్మడి కాశీనాథ్ మరియు జనసేన పార్టీ రాష్ట అధికార ప్రతినిధి శ్రీమతి రాయపాటి అరుణ హాజరయ్యారు. ఈ సందర్భంగా జనసేన మరియు తెలుగుదేశం పార్టీల నాయకులు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొని ఇమ్మడి కాశీనాథ్ తర్లుపాడు జనసేన నాయకులు వెలుగు కాశీరావు మరియు వారి బృందాన్ని అభినందించారు. అనంతరం స్వామి వారి ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి బొందిలి కాశీరామ్ సింగ్, జిల్లా కార్యదర్శి శిరిగిరి శ్రీనివాసులు, తర్లుపాడు మండల అధ్యక్షులు చేతుల శ్రీనివాసులు, జనసేన నాయకులు పిన్నెబోయిన శ్రీనివాసులు, రత్నకుమార్, వెలుగు కాశీరావు, మహేష్, సునీల్, సురే సువర్ణ, జనసేన మరియు తెలుగుదేశం పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Share this content:

Post Comment