అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వైసీపీ కిరాయి మూకలపై తక్షణమే చర్యలు తీసుకోవాలి: బాబు పాలూరు

బొబ్బిలి జనసేన నాయకులు, వీర మహిళలు, జనసైనికులు మన బొబ్బిలి డి.ఎస్.పిని కలసి వైసిపి కిరాయి నాయకులు మరియు వైసిపి పెయిడ్ మీడియా చానల్స్ పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులపై అసభ్య ప్రచారాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవలసిందిగా కోరుతూ ఒక లేఖను అందచేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు, బొబ్బిలి మండల అధ్యక్షులు సంచాన గంగధర్, తెర్లాం మండల అధ్యక్షులు మరడాన రవి, రామభద్రపురం మండల అధ్యక్షులు బవిరెడ్డి మహేష్, బలిజిపేట మండల అధ్యక్షులు బంకురు పోలినాయుడు, జనసేన వీరమహిళలు దివ్య, యామిని, రమ్య, యడ్ల లక్ష్మి, రేవల్ల లక్ష్మి మరియు జనసేన నాయకులు ఉమామహేష్, యెందువ సత్య, వాండ్రాసి వెంకటరమణ, పల్లెం రాజా, ఆబోతుల రాజు, చీమల సతీష్, కొరగంజి సాయి తదితర జనసైనికులు పాల్గొన్నారు.