జనసేన కార్యవర్గ సమావేశంలో మాకినీడి శేషుకుమారి

పిఠాపురం కె.వి.కె.టీ ఫంక్షన్ హాల్ లో, జనసేన పార్టీ ఇంఛార్జి శ్రీమతి మాకినీడి శేషుకుమారి అధ్యక్షతన పిఠాపురం పట్టణ జనసేన పార్టీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శేషుకూమారి మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరియు రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందులు దుర్గేష్ ఆదేశనుసారం కొద్ది రోజుల్లో పిఠాపురం పట్టణ పార్టీ కార్యవర్గం నియామకం చేయడం జరుగుతుంది. దీనికి అనుగుణంగా ప్రతి ఒక్క జన సైనికుడు కూడా వారి వారి అభిప్రాయాలు తెలియజేసి కార్యవర్గాన్ని బలపరచాలని అన్నారు. పిఠాపురం నియోజకవర్గానికి పట్టణం కుంభస్థలం లాంటిది అలాంటి పట్టణంలో ప్రతి జనసైనికుడు కూడా కార్యకర్తగా మారాలి. పట్టణంలో ఉన్న 30 వార్డుల్లో వార్డుకి పది మంది బలమైన కార్యకర్తలు తయారయ్య వార్డుకమిటీలుగా ఏర్పడి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి అధికార దిశగా అడుగులు వెయ్యాలని అన్నారు. పవన్ కళ్యాణ్ ఆశయాలను, సిద్ధాంతాలను, వారి బాటలో నడుచుకుంటూ ప్రజల్లోకి తీసుకెళ్లి బలంగా పనిచేయాలని దిశానిద్దేశం చేశారు. టౌన్ నాయకులు బుర్ర సూర్య ప్రకాష్ ఈ ఏర్పాట్లు చేసినందుకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. జనసైనికుల అభిప్రాయానుసారం పిఠాపురం పట్టణ అధ్యక్షుడిని నియమించడం మరియు పిఠాపురం కార్యవర్గాన్ని ప్రకటించడం జరుగుతుంది అని శేషు కుమారి తెలిపారు. రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ ప్రత్యామ్నాయమని, పేదలకు న్యాయం జరగాలన్న, రాష్ట్రానికి ఉన్న ఆర్థిక సమస్యలు తీరాలన్న పవన్ రావాలి అనే దిశగా కార్యకర్తలు అందరూ ముందుకు వెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి జనసైనికుడికి, కార్యకర్తకు, నాయకులకు, మీడియా మిత్రులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మొగిలి అప్పారావు, చీకట్ల శ్యాం కుమార్, పిఠాపురం పట్టణ నాయకులు బుర్ర సూర్య ప్రకాష్, చెల్లుబోయిన సతీష్, మాజీ కౌన్సిలర్ కర్రీ కాశీ విశ్వనాధ్, జనసేన కౌన్సిలర్ అభ్యర్థి పల్నాటి మధు, మేళం రామకృష్ణ, కసిరెడ్డి నాగేశ్వరరావు, బొజ్జ కుమార్, వేల్పూల చక్రధర్, పబ్బినీడి ప్రసాద్, తోట సతీష్, నామా శ్రీకాంత్, చెల్లుబోయిన నాగేశ్వరరావు, సికోలు రాజశేఖర్, మైనాబత్తుల చిన్న, గరగ బాబీ, వినయ్, పసుపులేటి గణేష్, రెడ్డిపల్లి బాబురావు, చొడిశెట్టి నాని, చోడిసెట్టి రాజా, మగపు సతీష్, పుణ్యమంతుల నంది బాబు, చెల్లుబోయిన విజయ్, కొండేపూడి శివ, జి సురేష్, పిట్ట చిన్న, బుద్దాల చంటిబాబు, ఖండవల్లి సూర్యకుమారి, సిరా రాజు, దాకే ప్రసాద్, సుబ్రమణ్యం, టౌన్ జన సైనికులు, నాయకులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.