అభిమానులతో ఆత్మీయంగా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవన్ నటిస్తున్న వకీల్ సాబ్ సినిమా ఎప్పుడు వస్తుందా అని కళ్ళల్లో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, వేణు శ్రీరామ్ తెరకెక్కిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ షూటింగ్‌లో ఉన్న సమయంలో కొందరు అభిమానులు వచ్చిన సమయంలో వారితో కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు పవన్. వారితో పాటు కింద కూర్చొని ఉన్న పవన్‌ని చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు. ఈ ఫొటోలో పవన్ చాలా యంగ్‌గా కనిపిస్తున్నారంటూ నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.