ముక్కినాడ పాకలు గ్రామంలో పలు బాధిత కుటుంబాలకు అండగా నిలిచి మానవత్వం చాటుకున్న బత్తుల

రాజానగరం నియోజకవర్గంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఎవరికి ఏ ఆపద వచ్చినా, మరుక్షణమే నేనున్నానంటూ, చేతనైనంత సహాయం చేస్తూ, మానవత్వంతో మనస్సులు గెలుచుకుంటున్న పుణ్య దంపతులు, రాజానగరం నియోజకవర్గ జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి వెంకటలక్ష్మి. బుధవారం రాజానగరం మండలంలో పూర్తిగా ఎస్సి సామాజికవర్గం నివాసముండే ‘ముక్కినాడ పాకలు’ గ్రామంలో అనేక ఇబ్బందులతో బాధపడుతున్న పలు బాధిత కుటుంబాలను ఓదార్చి, మనోధైర్యం చెప్పి ఆర్థిక సహాయం అందించి శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి తమ సేవా తత్పురతను చాటుకున్నారు.

  • గ్రామవాసి ‘పాకా డేవిడ్ రాజు’ కి ప్రమాదంలో తలకు తీవ్రమైన గాయాలతో బయటపడి కోలుకుంటున్న వారిని పరామర్శించి, ధైర్యంగా ఉండమని చెబుతూ.. వైద్య ఖర్చుల నిమిత్తం ₹5,000/- వేల రూపాయల ఆర్థిక సహాయం మరియు 25 కేజీలు రైస్ బ్యాగ్ అందించి, జనసేన పార్టీ తరపున అన్ని విధాలుగా అండగా ఉండమని భరోసా ఇవ్వడం జరిగింది.
  • కాలికి గాయం అవడంతో గత ఆరు నెలలుగా ఇంటిపట్టునే ఉంటూ ఇబ్బంది పడుతున్న మండేలా సత్యనారాయణని పరామర్శించి, డాక్టర్లు సూచించిన విధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతూ వారి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ₹5,000/- వేల రూపాయల ఆర్థిక సహాయం మరియు 25 కేజీలు రైస్ బ్యాగ్ అందించి, జనసేన పార్టీ తరపున అన్ని విధాలుగా అండగా ఉండమని భరోసా ఇవ్వడం జరిగింది.
  • ప్రమాదంలో కాలికి ఫ్రాక్చర్ అయిన పాకా అబ్రహంని పరామర్శించి, కోలుకుంటున్న విధానంపై ఆరా తీసి కుటుంబ ఖర్చుల నిమిత్తం ₹5,000/- వేల రూపాయల ఆర్థిక సహాయం మరియు 25 కేజీలు రైస్ బ్యాగ్ అందించి, జనసేన పార్టీ తరపున అన్ని విధాలుగా అండగా ఉండమని భరోసా ఇవ్వడం జరిగింది.
  • పెద్దలు పాకా చినబాబూరావు గత కొంతకాలంగా డయాలసిస్ తో ఇబ్బంది పడుతున్న వారిని పరామర్శించి, మనోధైర్యం కల్పించి కుటుంబ ఖర్చుల నిమిత్తం ₹5,000/- వేల రూపాయల ఆర్థిక సహాయం మరియు 25 కేజీలు రైస్ బ్యాగ్ అందించి, జనసేన పార్టీ తరపున అన్ని విధాలుగా అండగా ఉండమని భరోసా ఇవ్వడం జరిగింది.

ఈ పర్యటనలో శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మితో పాటు మండిల్ల సాంబమూర్తి, కుసుమ శ్రీను,సైను రాజశేఖర్, బక్కే అశోక్, బక్కే విశాక్, పాకా వెంకీ, కవల శ్రీరామ్, కవల హరిచంద్రప్రసాద్, సోడసాని సురేష్, సోడసాని చక్రధర్, ఏ శ్రీను, సోడసాని రాంమూర్తి, వీరమహిళ మండేలి చిన్నపాప, సోడసాని వెంకటేష్, కొండేపూడి రాజు, సంగుల రమేష్, కలిదిండి మణికంఠ స్వామి,రాయి గంగాధర్, గుబ్బల వీరవెంకట స్వామి, సంగుల లక్ష బాబు, మేకల ప్రదీప్, మరియు శ్రీకృష్ణపట్నం సర్పంచ్ కిమిడి శ్రీరామ్, కొత్తపల్లి రఘు, వేగిశెట్టి రాజు, నాతిపాం దొరబాబు, కమిడి సత్యనారాయణ, పంతం సూరిబాబు, నల్లమిల్లి మణికంఠ, సుంకర బాబ్జి, నాతిపాం సుబ్బారావు, నాతిపాం రాజుబాబు, పంతం మణికంఠ, నాతిపాం మణితేజ తదితర జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.