పల్లెపోరులో గాంధీ జయంతి సాక్షిగా వైసీపీ సర్కారుపై గాటు విమర్శలు

  • జనసేన పార్టీ ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్

తాడేపల్లిగూడెం: మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా పెంటపాడు మండలం రావిపాడు గ్రామ పల్లెపోరులో బాగంగా ముందుగా గ్రామ పెద్దలతో కలిసి బొలిశెట్టి శ్రీనివాస్ మహాత్మా గాంధీకి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జై జవాన్, జై కిసాన్ అంటూ దేశ ప్రజల్లో ప్రధానిస్ఫూర్తి రగిలించిన భారత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కూడా ఈ రోజే అవ్వడం, అహింసే పరమ ధర్మంగా సత్యాగ్రహం ద్వారా స్వాతంత్రాన్ని సాధించిన మహాత్ముని జయంతి సందర్భంగా వారిరువురికీ శ్రీనివాస్ నివాళులు అర్పించారు. అనంతరం గ్రామ ప్రజల ఉద్దేశించి సత్యం, అహింస అనే ఆయుధాలతో యుద్ధం చేయడం ఎలాగో ప్రపంచ మానవాళికి ఆచరించి చూపిన మహాత్ముడు మన గాంధీజీ అని, అహింసా యుత ప్రజా పోరుతో పరాయి పాలన నుండి భారతదేశాన్ని విముక్తం చేశారని పేర్కొన్నారు. బాపూజీ జయంతి సందర్భంగా మహాత్ముడిని స్మరించుకుంటూ మనస్పూర్తిగా అంజలి ఘటిస్తున్నాను అని స్పష్టం చేశారు. అనంతరం వైసీపీ ప్రభుత్వ గురించి మాట్లాడుతూ బ్రిటిషర్ల లక్షణాలు పుణికి పుచ్చుకున్న పాలకులు రాష్ట్రంలో ఉన్నారంటూ మండిపడ్డారు. ప్రజలను వర్గాలుగా విభజించి పాలించే ధోరణిలో వెళ్తున్నారని శ్రీనివాస్ అసహనం వ్యక్తం చేశారు. అలాగే జనసేన అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరేలా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయాలు ఉంటాయనీ వచ్చే ఎన్నికలలో జనసేన పథకాలు గురించి స్థానిక ప్రజలకు వివరిస్తూ రావిపాడు గ్రామంలో బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆ గ్రామంలో పల్లెపోరును ముగించారు. ఈ కార్యక్రమంలో పెంటపాడు మండల అధ్యక్షులు పుల్లా బాబీ, స్థానిక నాయకులు ములగాల శివ కేశవ, కాజులూరి దుర్గా మల్లేశ్వరరావు, ములగాల ప్రసాద్, ద్వారబంధం వెంకట సురేష్, వంగూరి వెంకట సుబ్బారావు, వంగూరు శివ నాగేశ్వరరావు, అయితం శ్రీనివాస్, మదాసు శ్రీనివాస్, మదాసు చంద్రశేఖర్, ములగాల సువర్ణరాజు, వంగూరి పాండురంగారావు, ములగాల పనింద్ర, కడియం శివ, కోనపురెడ్డి రాజేష్, తిలకలపల్లి మణికంఠ, వీరమహిళలు ద్వారబంధం కనకదుర్గ, సజ్జ పని, పాతే జోష్ణ,పెన్నాడ పవన్
పెన్నాడ శివ, పెన్నాడ రాము, పెన్నాడ ప్రభు తేజ, ఆల్లి రాజు, అల్లి సంజు, తాడి పత్తి నాగరాజు, తాటిపర్తి ప్రసాద్, నిమ్మల విజయ్,
తోట అభిషేక్, తోట కిషోర్ తాడేపల్లిగూడెం నుంచి జిల్లా ప్రధాన కార్యదర్శి యంట్రపాటి రాజు, జిల్లా కార్యదర్శి మద్దాల మణికుమార్, పట్టణ ప్రధాన కార్యదర్శి గుండుమోగుల సురేష్, సోషల్ మీడియా ఇంచార్జ్ బైనపాలేపు ముఖేష్, జనసేనపార్టీ నాయకులు జగత్ సోమశంకర్, బుద్దన బాబులు మాదాసు ఇందు, అడబాల మురళి, చాపల రమేష్, పిడుగు మోహన్ బ్రదర్స్, దాగారపు శ్రీను, దంగేటి చందు, జామ్ శెట్టి ప్రసాద్, అర్జుల కిషోర్, పెనుబోతుల బాలాజీ, రావాడ దుర్గారావు, మట్ట రాంబాబు, బట్టిరెడ్డి రత్తయ్య మరియు వీరమహిళ విభాగం జిల్లా కో ఆర్డినేటర్ కసిరెడ్డి మధులత, పెంటపాడు మండల అధ్యక్షురాలు పెనుబోతుల సోమలమ్మ, తాడేపల్లిగూడెం మండల అధ్యక్షురాలు వెజ్జు రత్న కుమారి, ముద్దాల చిన్ని, మధుమతి, బసివి రెడ్డి ప్రశాంతి, సామినేని సత్యవతి, తోట రాణి తదితరులు పాల్గొన్నారు.