జనసేనానికి అండగా, అధికార పార్టీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ దుమ్ము దులిపిన బోడపాటి రాజేశ్వరి

తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రి రూరల్ కడియం మండలము, కడియపు లంక గ్రామానికి చెందిన జనసేన వీరమహిళ, జిల్లా ప్రధాన కార్యదర్శి బోడపాటి రాజేశ్వరి మాట్లాడుతూ, జనసేనాని పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ ఎంత తీసుకుంటే, మీకు ఏంటి బాధ అని… ఆయనకున్న ఇమేజ్, మీకు ఎక్కడిదని… ఒక్కసారి అధికారం వచ్చిన పాపానికి, పెద్ద పెద్ద మాటలు, తమరు ఏదో ప్రజల సొమ్మును పెద్ద పొడుపు చేస్తున్నట్లుగా బిల్డప్ ఇస్తూ, మాట్లాడటం తగదని, మీ ప్రభుత్వం, ప్రభుత్వ కార్యాలయాలకు స్కూళ్లకు రంగులు పేరుతో ప్రతి కార్యాలయానికి వేయడం తప్పు పట్టిన కోర్టులు, మొట్టికాయలు మొట్టిన విషయం మీకు తెలియదా? రంగుల పేరిట మీరు ఖర్చు చేసిన మూడు వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని తమ ప్రభుత్వం, మంత్రులు ప్రభుత్వం బిల్డింగులకు రంగులు పేరుతో ప్రజల సొమ్మును వృధా చేసారని, ప్రజలకు తెలియదని, అనుకుంటున్నారా? అని ఈ విషయంపై అధికార పార్టీ నీటిపారుదలశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తన సూటి ప్రశ్నలతో సంధించిన బాణం దెబ్బకు సమాధానం చెప్పాలని, ఉగ్ర రూపం ధరించిన మహిళగా, పూనకం వచ్చిన అమ్మవారిగా, మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను దుమ్ముదులిపి ప్రశ్నించారు. మీ ప్రభుత్వం మీరు ఇలాంటి దుబారా ఖర్చు చేస్తే తప్పు లేదు కానీ, తన కష్టార్జితానికి తగిన ప్రతిఫలం, ఇమజె కి తగ్గ, జీతం తీసుకుంటే తప్పు వచ్చింది కదా మీకు? సినిమా వాళ్లు అంటే మీకు అంత లోకువ!, సినిమా వాళ్ళు రాజకీయాలకు పనికిరారా? సినిమాల్లో నటించడం హై రిస్కుతో కూడిన పని, ప్రాణాలకు తెగించి పనిచేయడమే కదా! ప్రపంచంలో ఎంత మంది హీరోలు, హీరోయిన్లు ఎంత పారితోషకం తీసుకుంటే, ఎక్కడా లేని బాధ మీకు ఎందుకు వస్తున్నది? ఒక్కడికి పడి ఏడవడం ఎందుకని, వ్యక్తిగత జీవితాలను అడ్డంపెట్టుకుని కుళ్ళు రాజకీయాలు చేయడం మానాలని, మంత్రి అనిల్ కుమార్ కు బోడపాటి రాజేశ్వరి జనసేన వీరమహిళ తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి హితవు పలికారు.