ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ విజయం కోసం ఆదివారం రాజమండ్రిలో జనసేన ఆత్మీయ సమావేశం నిర్వహించింది. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ సమావేశానికి హాజరై కూటమి అభ్యర్థి విజయానికి ప్రణాళికాబద్ధంగా పని చేయాలని, సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఉభయ గోదావరి జిల్లాల జనసేన ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజక వర్గాల ఇంచార్జిలు, నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు.
Share this content:
Post Comment