బత్తుల సమక్షంలో మాదిగ సామాజికవర్గం నుండి జనసేనలోకి భారీ చేరికలు

  • బత్తుల సమక్షంలో జనసేన పార్టీలో చేరిన మాజీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఎం ఆర్పిఎస్ మాజీ అధ్యక్షులు కొత్తపల్లి రఘు మాదిగ.
  • పార్టీలోకి ఘనంగా ఆహ్వానించిన బత్తుల.
  • అన్ని వర్గాల ప్రజలకు సమన్యాయం కోసం జనసేన పార్టీ అభివృద్ధికి చేయి చేయి కలుపుదామని ఇరువురి నేతల పిలుపు.
  • దళితుల సమస్యల మీద, వారి హక్కుల కోసం పోరాడేది జనసేన పార్టీ ఒక్కటే అని పలువురి ప్రసంగం.
  • కొత్తపల్లి రఘు మాదిగ చేరికతో నియోజకవర్గంలో మారనున్న రాజకీయ సమీకరణాలు.

రాజానగరం నియోజకవర్గం, రాజానగరం జిఎస్ఎల్ పెట్రోల్ బంక్ పక్కనున్న పార్టీ కార్యాలయం నిర్మాణంలో ఉన్న ప్రదేశంలో జరిగిన బహిరంగ సభలో జనసేన నాయకులు బత్తుల బలరామకృష్ణ, నా సేన కోసం నా వంతు కమిటీ కోఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ లో కీలకంగా పనిచేసిన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా మాజీ ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు కొత్తపల్లి రఘు మాదిగ వారి అనుచరుగణం, వారి బంధువులు సుమారు 400 మంది జనసేన పార్టీలో చేరారు వారందరికీ బత్తుల దంపతులు జనసేన కండువా వేసి, సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.. మాదిగ సామాజిక వర్గంలో రాజకీయంగా మంచి పట్టు ఉన్న కొత్తపల్లి రఘు మాదిగ గారి చేరికతో రాజానగరం నియోజకవర్గంలో సమీకరణాలు మారనున్నాయి. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి బత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ.. జిల్లాలో రాజకీయంగా మంచి పట్టు ఉన్న కొత్తపల్లి రఘు గారు జనసేన పార్టీలో చేరికతో మరింత ఉత్సాహంగా పనిచేసి, క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలపరిచి రానున్న ఎన్నికల్లో ఘనవిజయం సాధిస్తామని, టికెట్ విషయం, పొత్తుల విషయం దయచేసి ఎవరూ మాట్లాడవద్దని, ఆ విషయాన్ని అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారని, పవన్ కళ్యాణ్ గారి నిర్ణయానికి అందరూ కట్టుబడి పని చేద్దామని, మహనీయులు బిఆర్ అంబేద్కర్ గారు, బాబూ జగజ్జివన్ రామ్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేది పవన్ కళ్యాణ్ మాత్రమేనని, ఈ అరాచక ప్రభుత్వాన్ని గద్దె దించాలంటే అందరూ సమిష్టిగా పోరాడాలని.. ముఖ్యంగా రాజానగరం నియోజకవర్గంలో గుట్టలు, కొండలు, చెరువులు, ఇసుక తినేస్తున్న ఈ అవినీతి బకాసుర వైసిపి నాయకులు నుండి నియోజకవర్గాన్ని రక్షించాలంటే అన్ని వర్గాల ప్రజలు జనసేన పార్టీని ఆదరించి రానున్న ఎన్నికల్లో జనసేన పార్టీ విజయాన్ని కృషి చేయాలని పిలుపునిచ్చారు.. అనంతరం పార్టీలో చేరిన కొత్తపల్లి రఘు మాట్లాడుతూ.. రాజ్యాధికారం కొన్ని కుటుంబాలకే పరిమితమైన ఈ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో సామాన్యులకి సమన్యాయం గానీ, రాజ్యాధికారం గానీ వచ్చే అవకాశం లేదని, ఇటువంటి పరిస్థితుల్లో నిస్వార్ధంగా, నిజాయితీగా రాష్ట్రం కోసం సామాన్య ప్రజల కోసం రాష్ట్రంలో ఎవరైనా పని చేస్తున్నారంటే అది ఒక పవన్ కళ్యాణ్ మాత్రమేనని, అన్ని వర్గాలకు సామాజిక న్యాయం జరగాలంటే అది ఒక జనసేన పార్టీ తోనే సాధ్యమని, అందుకే జనసేన పార్టీలో చేరానని, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు, రాజకీయ విలువలు అందరూ కలిసి ముందుకు తీసుకెళ్లాలని, నియోజకవర్గంలో ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఎవరికి ఏ ఆపద వచ్చినా, బత్తుల బలరామకృష్ణ గారు స్పందిస్తున్న తీరు, వారిని ఆదుకుంటున్న గుణం తనకు ఎంతగానో నచ్చిందని అందుకే వారి నాయకత్వంలో పని చేయాలని నిర్ణయించుకున్నానని.. ఇందుకు ఉదాహరణ మొన్న కోటికేశవరం గ్రామంలో దళిత యువకుడి మృతి విషయంలో ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు పోరాడిన తీరు, వారి కుటుంబానికి న్యాయం జరిగిన విషయం ఈ సందర్భంగా అందరికీ గుర్తుచేసి, రానున్న రోజుల్లో మరింత మందిని జనసేన పార్టీలో చేరుస్తానని ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఇక్కడ జనసేన పార్టీదే విజయమని అన్నారు.. ఈ చేరికల్లో కీలకపాత్ర పోషించిన బొడ్డపాటి నాగేశ్వరరావు, బొంగా స్టాలిన్, కండవల్లి వీరబాబు లను పలువురు ప్రశంసించారు.. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు జిల్లా జాయింట్ సెక్రెటరీ మేడిశెట్టి శివరాం, మద్దాల ఏసుపాదం, చికట్ల వీర్రాజు, పోసుపో రత్నాజీరావు, బండి సత్యప్రసాద్, కొండేటి సత్యనారాయణ, ముక్కా రాంబాబు, చాట్ల వెంకటేష్, చాపల లక్ష్మి, మరియు జనసేన సర్పంచులు కిమిడి శ్రీరామ్, గుల్లింకల లోవరాజు, గళ్ళ రంగా, అడ్డాల శ్రీను, మన్యం శ్రీను, మాజీ ఎంపీటీసీ నాగభూషణం, గంగిశెట్టి రాజేంద్ర, తోరాటి శ్రీను, సంగుల రమేష్, పంతం సూరిబాబు, దాసరి సూరిబాబు, అరిగెల రామకృష్ణ, చిట్టిప్రోలు సత్తిబాబు, అడబాల ఆది విష్ణు, తోట అనిల్ వాసు, చల్లా రాము, శంకరం, కురుమళ్ళ మహేష్, ఆనందాల గోవింద్, యర్రంశెట్టి పోలవరం, కొల్లు రమేష్, గళ్లా శ్రీను, రఘునాథపురం బాబురావు, వీర్రాజు, బద్దం వెంకటరమణ, సులా సతీష్ వీరభద్రరావు తదితర అనేక మంది సీనియర్ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు.