దక్షిణ నియోజకవర్గంలో నిర్విరామంగా డా. కందుల సేవా కార్యక్రమాలు

  • కొనసాగుతున్న వార్డు పర్యటనలు
  • గడపగడపకు డాక్టర్ కందుల
  • ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ

విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన నాయకులు,
32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు సేవా కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. ప్రతిరోజు పలు వార్డులలో పర్యటనలు చేస్తూ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటున్నారు. సమస్యల పరిష్కారానికి చొరవ చూపిస్తూ ఆయన ప్రజలకు మరింత దగ్గరవుతున్నారు. ఆయన వెళ్లిన ప్రతి చోట ప్రజలు సాదర స్వాగతం పలుకుతున్నారు. సుడిగాలి పర్యటనలో భాగంగా 34 వ వార్డు లక్ష్మీదేవి పేటలో నవ వధువు పి.ఎల్మాజికి బంగారు తాళిబొట్టు, పట్టుబట్టలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతరులకు మంచి చేయడమే తనకు తెలుసని చెప్పారు.
సేవే దైవంగా భావిస్తూ ప్రజలకు మంచి చేస్తున్నట్లు వెల్లడించారు. జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తాను చేస్తున్న సేవా కార్యక్రమాలకు మద్దతు తెలియజేస్తూ సంపూర్ణ సహకారాన్ని అందజేస్తున్నట్లు వెల్లడించారు. రానున్న ఎన్నికలలో ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పారు.
ప్రజలు కూడా అధికార మార్పుపై ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికలు మాత్రం రాష్ట్రం రాజకీయాల్లో చాలా మార్పులు చోటు చేసుకోనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో 34వ వార్డు అధ్యక్షులు నీలం రాజు, వాసుపల్లి నరేష్, ప్రసాద్, హరీష్, సతీష్, అజయ్, సతీష్ బద్రి, రాజేష్, రమణ, దేవి, లలిత, హేమ, కుమారి, దక్షిణ నియోజకవర్గం యువ నాయకులు కందుల కేదార్నాథ్, బద్రీనాథ్, జనసైనికులు, వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.