ఈ వైసీపీ ప్రభుత్వంలో కొండ, మిట్ట, గట్టు దోచేందుకు కాదేది అనర్హం: గునుకుల కిషోర్

నెల్లూరు రూరల్, దేవరపాళెం గ్రామం అక్రమంగా మట్టి తరలింపు ఖండిస్తూ జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ఆ ప్రాంతాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాన్యులు ఒక ట్రాక్టర్ మట్టి కావాలంటే అనుమతులు, కేసులు, ఫైనులు విధించే ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఎవరి అనుమతులకు లోబడి ఇంత మట్టిని ఇక్కడి నుంచి ఎక్కడికి తరలించారు..? ఏ అవసరం నిమిత్తం తరలించారు అనేది సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. దాదాపు 500 పెద్ద ట్రక్కులు ఒక్కొక్క ట్రక్కు పన్నెండు వేల రూపాయలు వేసుకున్నా 60 లక్షల రూపాయల రెవిన్యూ ను ఇక్కడినుంచి తరలించబడి ఉన్నారు. దాదాపు ఆరు ఎకరాల మేర 15 అడుగుల లోతు పైబడి అక్రమంగా తవ్వి తరలించి ఉన్నారు. ఎక్కడైనా అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయని అధికారులు తెలియజేస్తే తవ్వుకుంటే ప్రాబ్లం ఏమిటి అని అడిగే అధికారులు ఈ 60 లక్షల రెవిన్యూ ప్రజా సంపద ఏమైందో తెలుపగలరు. ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం గ్రామ నిధులు ఖాళీ చేసి గ్రామాల సహజ వనరులు దోచుకు తింటున్న అధికారులందరూ వేడుక చూస్తున్నారు. జరుగుతున్న దోపిడీని ప్రజలందరూ గుర్తెరిగి ప్రజా ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరుతూ జనసేన పార్టీ సిద్ధాంతాల్లో ఒకటైన పర్యావరణ పరిరక్షణలో భాగంగా సహజ వనరులు కాపాడే బాధ్యత తీసుకుంటామని తెలియజేశారు.