తిరుపతిలో పెద్ద ఎత్తున యువత జనసేనలో చేరిక

  • రాష్ట్రానికి కాబోయే సీఎం పవన్ కళ్యాణ్.. కిరణ్ రాయల్

తిరుపతి: జనసేన పార్టీ తిరుపతి నియోజకవర్గ ఇన్చార్జ్ కిరణ్ రాయల్ ఆధ్వర్యంలో పట్టణ అధ్యక్షుడు రాజారెడ్డి సమక్షంలో స్థానిక 34, 35వ వార్డ్ అధ్యక్షులు రాజేష్ ఆచారి, అయ్యప్ప, మణికంఠ, కిరణ్ ఆధ్వర్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు ఆశయాలకు ఆకర్షితులై యువత పెద్ద ఎత్తున జనసేనలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా కిరణ్ రాయల్ మాట్లాడుతూ ఎవరు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నిన ఈ రాష్ట్రానికి కాబోయే సీఎం పవన్ కళ్యాణ్ మాత్రమేనని, రాష్ట్రంలో కవులు రైతుల కుటుంబాలకు అండగా నిలవడమే కాకుండా ప్రతి సమస్యపై ప్రశ్నిస్తూ ఆ సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నది ఒక్క జనసేనేనని, సమస్య ఉంటే ప్రజలకు ముందుగా జనసేన పార్టీ గుర్తొస్తుందని, ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రి చేసుకునే దిశగా అడుగులు వేయ్యాలని, అదేవిధంగా క్రియాశీలక సభ్యులను దృష్టిలో ఉంచుకొని 500 రూపాయలు వెచ్చించి సభ్యత్వం నమోదు చేసుకున్న వ్యక్తులకు జీవిత బీమా కింద 5 లక్షల రూపాయలు, వైద్య ఖర్చులనిమిత్తం 50 వేల రూపాయలను సభ్యత్వం నమోదు చేసుకున్న వ్యక్తికి అందేలా పవన్ కళ్యాణ్ మన కోసం ఓ మంచి కార్యక్రమాన్ని తీసుకువచ్చారని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పార్టీలో కొత్తగా చేరిన సభ్యులకు, జనసేన పార్టీ అభిమానులకు, స్థానిక ప్రజలకు దిశ నిర్దేశించారు.. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఆకేపాటి సుభాషిని, సుమన్ బాబు, పురుషోత్తం రాయల్, సాయి, జయ రెడ్డి, పురుషోత్తం, విజయ రెడ్డి, అదికేశవులు, జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, స్థానిక ప్రజలు అతిధులు పాల్గొన్నారు.