తునిలో ఎన్.డి.ఏ కూటమి జనసేన, టీడీపీ, బీజేపీ ప్రచార జోరు

తుని నియోజకవర్గం: గత వారం రోజులుగా తుని నియోజకవర్గంలో మార్నింగ్ గుడ్ మార్నింగ్ జనసేన అనే కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. అలాగే సాయంత్రం 4 గంటలనుండి 8 గంటలవరకు టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కార్యకర్తలతో ఇంటి ఇంటికి ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ కార్యక్రమం పార్లమెంట్ ఇంచార్జ్ మధు వీరేష్ ఆధ్వర్యంలో తుని నియోజకవర్గం సమన్వయ కర్త చోడిశెట్టి గణేష్, ఉమ్మడి జిల్లా జాయింట్ సెక్రటరీ పలివెల లోవరాజు, సెక్రటరీ నాగేంద్ర, మండల అధ్యక్షులు, చూచనలతో బోనం చినబాబు, అద్దేపల్లి బాలాజీ, గట్టెం నాగబాబు, బొప్పన రాంబాబు, తేనే శేషు, వంగలపూడి వంశీ, భాస్కర్, ముక్కురుపు శివ, కనిగిరి ప్రకాష్, మరియు తుని నియోజకవర్గ, జనసైనికులు పాల్గొనటం జరిగింది.