*చట్టపరమైన చర్యలకు జనసేన డిమాండ్
*పోలీసులకు ఫిర్యాదు చేసిన శ్రీమతి తంబళ్లపల్లి రమాదేవి
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేస్తూ మార్ఫింగ్ చేసిన ఫొటోలు పోస్ట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని నందిగామ నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమతి తంబళ్లపల్లి రమాదేవి కోరారు. ఇటీవల విశాఖపట్నం బీచ్‌లో నిర్వహించిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా, పవన్ కళ్యాణ్ ని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో ‘రిలాక్షింగ్ డెప్యుటీ సి.ఎం’ అంటూ ఆయన స్థానంలో కుక్క చిత్రాన్ని మార్ఫింగ్ చేసి అవమానకర పోస్టులు చేసిన @రందొంఫొరెస్త్వ్స్ప్ ఖాతాపై ఆమె ఆదేశాల మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నందిగామ పోలీస్ స్టేషన్ లో సీఐ వై.వీ.యల్. నాయుడు గారిని కలిసి జనసేన నాయకులు పిర్యాదు అందజేశారు. ఈ కార్యక్రమంలో చందర్లపాడు మండల అధ్యక్షులు వడ్ఢేల్లి సుధాకర్, నాయకులు ఎర్రబడి సురేష్, కొమ్మవరపు స్వామి, లీగల్ సెల్ అడ్వకేట్ తాడేపల్లి కాంతారావు, మొగిలిచర్ల లక్ష్మీకాంత్, చలమల పురుషోత్తం, షైక్ సైదా, కొట్టె బద్రి, కొమ్మినేడి సత్యనారాయణ, ఐలపోగు నాగేంద్ర, మందా శ్యామ్ బాబు, కటరపు జయరాజు తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని దూషించేలా వ్యవహరిస్తున్న వారి చర్యలు తీవ్రంగా ఖండించదగినవని జనసేన పేర్కొంది.
Share this content:
Post Comment