ఘనంగా కడవకుదురు జనసేన కార్యాలయ ప్రారంభోత్సవం

పర్చూరు నియోజకవర్గం: చిన్నగంజాం మండలం, కడవకుదురు గ్రామంలో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. కార్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ చేనేత వికాస విభాగం చైర్మన్ మరియు మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు, ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దపూడి విజయ్ కుమార్ పాల్గొనడం జరిగింది. కార్యక్రమానికి ముందుగా భారీ ర్యాలీతో నూతనంగా ఏర్పాటు చేసిన కార్యాలయం వద్దకు చేరుకొని కార్యాలయంను ఘనంగా ప్రారంభించడం జరిగింది. అనంతరం కడవకుదురు గ్రామ నాయకులతో, గ్రామస్తులతో సమావేశం నిర్వహించడం జరిగింది. నూతనంగా ఏర్పాటు చేసిన కార్యాలయంకు ప్రోత్సహించిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి నుంచి చేనేత విభాగం ప్రధాన కార్యదర్శి పర్వతం మధు, చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి జంజనం సాంబశివరావు (జె.ఎస్.ఆర్), ఎంటిఎంసీ అధ్యక్షులు మునగపాటి వెంకట మారుతీరావు, ఎంటిఎంసీ కార్యదర్శి షేక్ వజీర్, మంగళగిరి నియోజకవర్గం సోషల్ మీడియా కోఆర్డినేటర్ నందం మోహన్ రావు, మంగళగిరి పట్టణ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జొన్నాదుల పవన్ కుమార్, చిల్లపల్లి యూత్ సభ్యులు మేకల చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.